లో బీపీకి ప్రధాన కారణాలు ఇవే..!  

షేర్ చేయండి:
లో బీపీకి ప్రధాన కారణాలు ఇవే..!  

సాక్షి లైఫ్ : లో బీపీ అనేది మనిషి సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉంటే అది లో బీపీగా నిర్ధారిస్తారు. ఇటీవల చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో లో బ్లడ్ ప్రెజర్ (లో బీపీ)కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారం పర్యంగా ఈ సమస్య ఉన్నవారికి, సరైన ఆహారం తీసుకోని వారికి, సరైన రక్త ప్రసరణ లేకపోవడం కారణంగా కాలక్రమేణా లోబీపీ సమస్య తలెత్తుతుంది. 

చాలా మంది లో బ్లడ్ ప్రెజర్ ను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలు  కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

లోబీపీ రావడానికి చాలా కారణాలున్నాయి. "డీ" హైడ్రేష‌న్‌, గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం, విట‌మిన్ బీ12 లోపం, అడ్రిన‌లైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసీమియా, వేసో వ్యాగ‌ల్ రియాక్ష‌న్‌లు, పోస్టుర‌ల్ హైపో టెన్ష‌న్, హై బీపీ కోసం మందులు వేసుకోవ‌డం, ఆల్కహాల్‌ ఎక్కువగా తాగడం, డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల లోబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
లో బీపీ లక్షణాలు ఎలా ఉంటాయంటే..? 

-మైకంగా ఉండడం, 
-బాగా అలసిపోయినట్లుగా అనిపించడం
- కడుపులో తిప్పినట్లు అనిపించడం
-హార్ట్ పల్స్ రేటు పెరగడం
-శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
-తలనొప్పి
-కళ్ళు తిరగడం

ఇది కూడా చదవండి.. ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు వీటిలో తేడా ఏంటి..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.