PCOD : రోజువారీ ఈ అలవాట్లతో పీసీఓడీ సమస్య పరిష్కారం..
సాక్షి లైఫ్ : పీసీఓడీ (Polycystic Ovary Disease) అనేది హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సాధారణ సమస్య. దీనివల్ల నెలసరి సమయానికి రాకపోవడం, బరువు పెరగడం, ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారా దీనిని సులభంగా మేనేజ్ చేయవచ్చు. మీ రోజువారీ దినచర్యలో ఈ 6 చిన్నపాటి మార్పులు చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
పీసీఓడీని అదుపులో ఉంచే 6 అలవాట్లు..
1. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ..
పీసీఓడీ సమస్య ఉన్నవారు సమతుల్య ఆహారం తీసుకోవాలి. మీ భోజనంలో ఆకుకూరలు, పప్పులు, తృణధాన్యాలు, పండ్లు, పాలు, పెరుగు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తీపి పదార్థాలు, నూనెలో వేయించినవి, ప్యాకేజ్డ్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకుండా సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
2. రోజూ వ్యాయామం, యోగా..
జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీనికోసం రోజూ జిమ్‌కే వెళ్లాల్సిన పనిలేదు. వేగంగా నడవడం, సైక్లింగ్, రన్నింగ్ లేదా స్ట్రెచింగ్ వంటి సులభమైన వ్యాయామాలు చేయవచ్చు. కొత్తగా వ్యాయామం మొదలుపెట్టేవారు నెమ్మదిగా అలవాటు చేసుకోవడం మంచిది.
3. హెర్బల్ టీలతో ఉపశమనం..
రోజువారీ డైట్లో అప్పుడప్పుడు పుదీనా లేదా దాల్చినచెక్కతో చేసిన హెర్బల్ టీలను భాగం చేసుకోవచ్చు. అయితే వీటిని పీసీఓడీకి పూర్తి చికిత్సగా భావించకూడదు. ఒకవేళ మీరు ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే, వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
4. కంటినిండా నిద్ర..
ఆరోగ్యకరమైన దినచర్యకు సరైన నిద్ర అత్యంత కీలకం. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు మొబైల్ వాడకం తగ్గించాలి. నిద్రపోయే ముందు మంచి పుస్తకాలు చదవడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం అలవాటు చేసుకోండి.
5. ఒత్తిడికి దూరం..
ఒత్తిడి అనేది హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. కాబట్టి రోజులో కొంత సమయం మీకోసం కేటాయించుకోండి. ధ్యానం (meditation), దీర్ఘంగా శ్వాస పీల్చుకోవడం, యోగా లాంటివి చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.
6. ఆయుర్వేద ఔషధాల వాడకంలో జాగ్రత్త..
ఏవైనా మూలికలు లేదా ఆయుర్వేద ఉత్పత్తులు అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. మీరు ఇప్పటికే వేరే ఏవైనా మందులు వాడుతున్నా లేదా గర్భం దాల్చడానికి ప్లాన్ చేసుకుంటున్నా.. వైద్యుల సలహా లేకుండా సొంతంగా ఎలాంటి హెర్బల్ ఉత్పత్తులను వాడకూడదు.
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
