Manganese : మాంగనీస్‌ పుష్కలంగా లభించే ఆహారాలు..! 

షేర్ చేయండి:
Manganese : మాంగనీస్‌ పుష్కలంగా లభించే ఆహారాలు..! 

సాక్షి లైఫ్ : మాంగనీస్ లోపం అనేది అరుదైనప్పటికీ, సరైన ఆహారం ద్వారా దీనిని సులభంగా పొందవచ్చు. తృణధాన్యాలు (Whole Grains) తీసుకోవడం ద్వారా మాంగనీస్ లోపాన్ని కొంతమేర అధిగమించవచ్చు. ఓట్స్, గోధుమలు, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి వాటిలో మాంగనీస్ అధికంగా ఉంటుంది. నట్స్, సీడ్స్ లో సరైన మోతాదులో లభిస్తుంది. బాదం, వాల్‌నట్స్, పిస్తా, నువ్వులు (తెల్లవి/నల్లవి) మాంగనీస్ మంచి వనరులు. 

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

ఆకుకూరల్లో కూడా మాంగనీస్‌ పుష్కలంగా ఉంటుంది. పాలకూర, కాలే వంటి ముదురు ఆకుకూరల్లో ఇది లభిస్తుంది.శనగలు, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ వంటి వాటిలో కూడా మాంగనీస్ ఉంటుంది. బ్లాక్ టీ, గ్రీన్ టీలో కూడా మాంగనీస్ గణనీయంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో.. దాల్చినచెక్క, నల్ల మిరియాలలో మాంగనీస్ ఉంటుంది. 

వైద్యనిపుణులు సిఫార్సు చేసిన రోజువారీ మోతాదు (RDI).. మాంగనీస్ అనేది 'ట్రేస్ ఎలిమెంట్' కాబట్టి దీనిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అధిక మోతాదు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం కావచ్చు. రోజువారీ సిఫార్సు మేరకు (RDA) పురుషులు 19 ఏళ్లు పైబడినవారికి2.3 మి.గ్రా, మహిళలు19 ఏళ్లు పైబడినవారికి1.8 మి.గ్రా, గర్భిణీ స్త్రీలకు 2.0 మి.గ్రా ఒకవేళ పాలిచ్చే తల్లులకు అయితే  2.6 మి.గ్రా అవసరం ఉంటుంది.  

ఆహారం ద్వారా తీసుకునే మాంగనీస్ సురక్షితమైనది. అయితే, వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్ల రూపంలో అధిక మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. నిపుణులైన వైద్యులు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించి, మీ శరీర అవసరానికి తగిన మోతాదును బట్టి తీసుకోవడం శ్రేయస్కరం.

 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.