Mental Health Care : మెంటల్ హెల్త్ కేర్.. 'మండల' కళతో ఒత్తిడికి చెక్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉరుకులు పరుగుల జీవితం.. ఇంటా బయటా పని ఒత్తిడి.. వెరసి నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య 'మానసిక అలసట'. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతుంటారు. అయితే, ఎలాంటి ఖర్చు లేకుండా, కేవలం రంగులు, గీతలతో మనసును ప్రశాంతంగా మార్చుకునే అద్భుతమైన మార్గమే 'మండల ఆర్ట్' (Mandala Art). ఈ రోజుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటూ, ఇంటి అలంకరణలో భాగమైన ఈ కళ కేవలం గోడల అందాన్ని పెంచడానికే కాదు.. మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఒక అద్భుతమైన థెరపీగా పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..Knee Pain : నడిచినా నొప్పి.. కూర్చున్నా నొప్పి..? మోకాళ్లలో 'టక్ టక్' శబ్దం వస్తుందా..? ఇదిగో పరిష్కారం.. 

ఇది కూడా చదవండి..Irritable Bowel Syndrome : ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (IBS) అంటే ఏమిటి..? లక్షణాలెలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

ఏమిటీ మండల కళ..?

సంస్కృతంలో 'మండల' అంటే 'వృత్తం' లేదా 'కేంద్రం' అని అర్థం. ఒక చిన్న చుక్కతో ప్రారంభమై, దాని చుట్టూ రంగులు, రేఖాగణిత ఆకారాలతో అల్లుకుపోయే ఈ కళకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. మన ఋగ్వేదం కాలం నాటికే దీని మూలాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. హిందూ సంప్రదాయంలో దీనికి 'శ్రీయంత్రం' ఒక చక్కని ఉదాహరణ కాగా, బౌద్ధమతంలో దీనిని ధ్యానానికి (Meditation) ప్రతీకగా భావిస్తారు. నేటి ఆధునిక కాలంలో దీనిని 'మైండ్‌ఫుల్‌నెస్' సాధనగా పిలుస్తున్నారు.

రంగుల చికిత్స (Color Therapy) ఆరోగ్య ప్రయోజనాలు..


మండల చిత్రలేఖనం అనేది కేవలం ఒక ఆర్ట్ మాత్రమే కాదు, అదొక మానసిక వైద్యం. దీని వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం: రోజంతా పడ్డ అలసట, మానసిక ఒత్తిడి (Stress)ని దూరం చేయడంలో మండల ఆర్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. నిరాశ, ఆందోళనలతో బాధపడేవారు ఈ చిత్రాలు వేయడం వల్ల వారిలో ప్రతికూల ఆలోచనలు తగ్గి, సానుకూల దృక్పథం పెరుగుతుందని పరిశోధనలు సైతం నిరూపించాయి.

ఏకాగ్రత పెరుగుతుంది.. 

ఒకే ఒక బిందువు ఆధారంగా చుట్టూ గీతలు గీయడం వల్ల మెదడుకు మంచి వ్యాయామం లభిస్తుంది. ఇది మీ దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యాన్ని (Concentration) పెంచుతుంది.

భావోద్వేగాల వ్యక్తీకరణ..

మాటల్లో చెప్పలేని బాధలు, గందరగోళం, అంతర్గత ఒత్తిడిని ఈ రంగుల ద్వారా క్యాన్వాస్‌పై సులభంగా వ్యక్తపరచవచ్చు. ఇది ఒక రకమైన 'ఆర్ట్ థెరపీ'లా పనిచేసి మనసును తేలికపరుస్తుంది.

మానసిక రుగ్మతలకు చికిత్స..

 డిప్రెషన్, ఆటిజం, స్కిజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ మండల డిజైన్లు థెరపీగా ఉపయోగపడుతున్నాయి. ఒంటరితనాన్ని, బాధను మర్చిపోయేలా చేయడంలో ఈ రంగుల చికిత్స కీలక పాత్ర పోషిస్తుంది.

ఇంటికే కాదు.. హృదయానికీ అందం..!

విశ్వంలోని ప్రతిదీ కేంద్రం వైపు ఎలా ఆకర్షితమవుతుందో, మండల కళలోని గీతలు కూడా కేంద్రం వద్దే ఏకమవుతాయి. ఇది చూసేవారికి, వేసేవారికి తెలియని ఒక మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. అందుకే, నేడు చాలామంది దీనిని తమ ఇంటి గోడలపై అలంకరించుకోవడమే కాకుండా, రోజూ కాసేపు దీనిని ప్రాక్టీస్ చేస్తూ మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. మీకు మానసికంగా అలసటగా అనిపించినప్పుడు.. ఒక కాగితం, పెన్ను తీసుకుని ఒక చిన్న చుక్కతో మండల ఆర్ట్ గీయడం ప్రారంభించండి. ఆ రంగుల మాయాజాలం మీ ఒత్తిడిని ఎలా మాయం చేస్తుందో మీకే అర్థమవుతుంది.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.