అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

షేర్ చేయండి:
అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

సాక్షి లైఫ్ : అన్ని క్యాన్సర్లు ప్రాణాంతకమేనా..? వాస్తవం: అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఒక్కో కారణంగా ఒక్కో రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి రకానికి తీవ్రత వేర్వేరుగా ఉంటుంది. ఒకవేళ ప్రారంభ దశలో అధునాతన చికిత్స అందిస్తే చాలా మంది రోగులు ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

 

వాస్తవం : వృద్ధులలో, ముఖ్యంగా 55-60 ఏళ్లు దాటిన వారిలో బ్లడ్  క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ. తీవ్రమైన లుకేమియా కేసులు 20-40 సంవత్సరాల వయస్సు వారిలో కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అయినప్పటికీ, అనుభవజ్ఞులైన నిపుణులు సరైన నైపుణ్యంతో చికిత్స అందించినట్లయితే, ఈ రోగులలో సుమారు 60-70శాతం మందికి వివిధ చికిత్సా విధానాలతో వ్యాధిని నయం చేయవచ్చు.

 బ్లడ్ క్యాన్సర్ అనేది పిల్లలైనా, పెద్దవారైనా ఏ వయసు వారైనా రావచ్చు. కొన్ని రకాల జబ్బులు జన్యుపరంగా వస్తాయి. అటువంటివాటిలో క్యాన్సర్ కూడా ఉంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం వయస్సుపై బడినవారిలోనే ఎక్కువ అనేది వాస్తవం కాదు. అది కేవలం అపోహ మాత్రమే. ఇది ఏ వయస్సులోనైనా రావొచ్చు.

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.