లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి (Lipoprotein Glomerulopathy) అనేది ఒక అరుదైన కిడ్నీ వ్యాధి. ఈ వ్యాధి వచ్చినవారిలో కిడ్నీలోని గ్లోమెరులలో లిపోప్రోటీన్ల స్వరూపం మారిపోతుంది. దీని కారణంగా మూత్రంలో ప్రోటీన్ లీకేజి అవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా పెద్దవాళ్లలో కనిపిస్తుంది. కానీ చాలా అరుదుగా మాత్రమే చిన్నారులలో వస్తుంది.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
లిపోప్రోటీన్ గ్లోమెరులోపతీ అనేది అత్యంత అరుదైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కేవలం 200 కేసులు మాత్రమే బయటపడ్డాయి. అవి కూడా చైనా, జపాన్ దేశాల్లోని పెద్దలకు మాత్రమే వచ్చాయి. ఈ రెండు దేశాల్లో కూడా ఇవి రావడంచాలా తక్కువ. కర్నూలుకు చెందిన ఓ నాలుగేళ్ల బాలుడికి ఇటీవలఈ వ్యాధి వచ్చింది. దక్షిణ భారతదేశం మొత్తమ్మీద ఇదే మొట్టమొదటి కేసుగా పరిగణిస్తున్నారు వైద్యులు. సహజంగా ఇలాంటి వ్యాధి ఇప్పటివరకుపెద్దల్లో మాత్రమే కనిపించింది.
కానీ చిన్న చిన్నపిల్లల్లో అరుదుగా వచ్చే ఈ డిసీజ్. కేవలం నాలుగేళ్ల వయసులో రావడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి సారి అని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఏపీఓఈ జన్యు మ్యుటేషన్ వల్ల కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి, అవి కిడ్నీలో పేరుకుపోయి, దానివల్ల మూత్రంలో ప్రోటీన్ లీకేజి, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే దానికి అంత సమర్థమైన చికిత్స చేయొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
