New Study : సంగీతం వింటే 40% తగ్గనున్న డిమెన్షియా ముప్పు..!  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వృద్ధాప్యంలో చాలా మందిని వేధించే జ్ఞాపకశక్తి సమస్యలు, డిమెన్షియా (Dementia - మతిమరుపు) ప్రమాదాన్ని తగ్గించడంలో సంగీతం ఒక మహత్తర ఔషధంలా పనిచేస్తుందని ఒక సంచలనాత్మక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు తమ దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా సంగీతం వినడం లేదా వాయిద్యాలు వాయించడం ద్వారా, డిమెన్షియా వచ్చే ప్రమాదాన్ని దాదాపు 40 శాతం వరకు తగ్గించుకోవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ (Monash University) నేతృత్వంలో 10,800 మందికి పైగా వృద్ధులపై సుదీర్ఘకాలం పరిశోధన చేసిన తర్వాత ఈ వివరాలను 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గెరియాట్రిక్ సైకియాట్రీ' (International Journal of Geriatric Psychiatry) లో ప్రచురించారు.

  అద్భుత ఫలితాలు ఏం చెబుతున్నాయి అంటే..?

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని వారి సంగీత అలవాట్ల ఆధారంగా మూడు విభాగాలుగా విభజించి పరిశీలించారు. ఎప్పుడూ సంగీతం వినేవారిలో, అస్సలు వినని లేదా అరుదుగా వినేవారితో పోలిస్తే, డిమెన్షియా వచ్చే ప్రమాదం 39 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అంతేకాదు క్రమం తప్పకుండా ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయించే అలవాటు ఉన్నవారిలో కూడా డిమెన్షియా ముప్పు 35 శాతం వరకు తగ్గింది.

రెండూ చేసే వారిలో..  

 సంగీతం వినడం, వాయిద్యం వాయించడం రెండింటిలో చురుకుగా పాల్గొనేవారిలో డిమెన్షియా ముప్పు 33 శాతం తగ్గింది, అంతేకాక వారిలో జ్ఞానపరమైన బలహీనత (Cognitive Impairment) వచ్చే ప్రమాదం కూడా 22 శాతం తక్కువగా ఉంది. 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.