సాక్షి లైఫ్ : జ్వరం వచ్చినా, తలనొప్పి అనిపించినా వెంటనే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోండి.. అని సలహా ఇస్తుంటారు. అదే సలహాను వెంటనే పాటిస్తారు. జ్వరం వచినప్పుడే కాదు.. తలనొప్పి, పంటి నొప్పి, బెణుకులు, జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఏమాత్రం అనిపించినా సరే.. పారాసిటమాల్ ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పారాసెటమాల్‌ను ఎసిటమైనోఫెన్ అని కూడా పిలుస్తారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పారాసెటమాల్ వినియోగం బాగా పెరిగింది.
సైడ్ ఎఫెక్ట్స్..
పారాసెటమాల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే..? అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. దీని వల్ల సమస్యలుప్పటికీ కొన్ని సందర్భాలలో కొన్ని సార్లు వినియోగించక తప్పదు. అయితే పారాసిటమాల్ ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం చాలా ప్రమాదం అని చెబుతున్నారు పరిశోధకులు.
ప్రాణాంతకం..
కొన్ని సమయాల్లో ప్రాణాంతకం కూడా కావొచ్చట. అధిక మోతాదులో తీసుకోవడం, లేదా ఉప్పునీటి తో పారాసెటమాల్ తీసుకోవడంవల్ల మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఎంత మోతాదులో పారాసిటమాల్ ప్రభావవంతంగా పనిచేస్తుందనే దానిపై ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
చిన్నారులకు..
పెద్దలకైతే ఒక మోతాదుకు 1 గ్రాము తీసుకోవాలి, అలా ఒక రోజులో 4 గ్రాములకు మించి తీసుకోకూడదు. ఒకవేళ వారికి ప్రతిరోజూ మద్యం సేవించే అలవాటు ఉండి ఉంటే ఇందులో సగం వంతు అంటే ఒక రోజులో 2 గ్రాములకు మించి పారాసెటమాల్ తీసుకోవద్దు. పిల్లలకు వేసేటపుడు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
సమస్య వచ్చిన ప్రతిసారి పారాసెటమాల్ ఇష్టారీతిన తీసుకోవడం మంచిది కాదు. అవసరం మేరకే, తక్కువ మోతాదు నుంచి తీసుకుంటుండం చేయాలి.
వివిధ రకాల ఔషధాలు..
వివిధ రకాల సమస్యలకు వివిధ రకాల ఔషధాలు ఉంటాయి. ప్రతి ఔషధం భిన్నమైన పనితీరును కలిగి ఉంటుంది. కొన్ని కొన్ని మందులు ఖాళీ కడుపుతో తీసుకోవాలి, మరిన్నింటిని పాలతో తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీకు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ను ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అని స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ఆ ప్రకారమే ఆయా మెడిసిన్స్ వాడాలి.
ఆల్కహాల్ తీసుకున్నప్పుడు..
ఇక పారాసెటమాల్ విషయానికి వస్తే ఎలా తీసుకున్నా దాదాపు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆల్కహాల్ సేవించినపుడు మాత్రం పారాసెటమాల్ తీసుకుంటే దుష్ఫ్రభావాలు ఉంటాయి. ఆల్కహాల్‌లో ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్ సమ్మేళనం పారాసెటమాల్‌తో ప్రతిచర్య జరుపుతుంది. దీని కారణంగా వికారం, వాంతులు, తలనొప్పి, మూర్ఛ, అయోమయం వంటివి సంభవించవచ్చు. రాత్రిపూట అతిగా మద్యం సేవించి ఆ ఉదయాన్నే కలిగే హ్యాంగోవర్‌ను వదిలించుకోవడం కోసం పారాసెటమాల్ తీసుకోవద్దు.
ఈ రెండింటి కలయికతో కాలేయం విషపూరితంగా మారుతుంది. ఇది మీకు ప్రాణాంతకం కావచ్చు. ఒక్క పారాసెటమాల్ మాత్రమే కాదు, ఆల్కహాల్‌తో మరేదైనా ఔషధం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ ఔషధాలు కొనేటపుడు వాటితో ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో అడిగి తెలుసుకోండి.
ప్రాణాలకు ముప్పు..
పారాసిటమాల్ తేలికపాటి మెడిసినే అయినప్పటికీ, మీరు దానిని మోతాదుకు మించి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరి స్తున్నారు వైద్య నిపుణులు.. కాబట్టి ఎలాటి సమయంలోనైనా సరే డాక్టర్ల సలహా మేరకే పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవాలి.
ఇది కూడా చదవండి.. నువ్వులలో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com