వేసవికాలంలో చర్మ సమస్యలకు కారణాలివే..
సాక్షి లైఫ్ : వేసవి కాలం, వర్షాకాలంలో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా రెండు సీజన్లలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిలో చర్మ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. రింగ్‌వార్మ్, గజ్జి, దురద, దద్దుర్లు వంటి అనేక చర్మ సమస్యలు ఈ సీజన్‌లో కనిపిస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పు, గాలిలో తేమ పెరగడం, ఎక్కువ చెమట పట్టడం, పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా సమ్మర్ లో చర్మ సంబంధిత సమస్యలు వస్తుంటాయి.
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో వేడి చేస్తోందా..? ఇది మీకోసమే..!
అలర్జీ సమస్యలున్నవారితో సన్నిహితంగా ఉన్నా కూడా స్కిన్ ప్రోబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. చర్మ వ్యాధులు తరచుగా దురద, మంట మొదలైన లక్షణాలతో మొదలవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే, సబ్బు, పెర్ఫ్యూమ్, డియోడరెంట్, బాడీ వాష్ వంటి రసాయనిక ఉత్పత్తులను ఉపయోగించడం మానేయ్యాలి. లేదంటే ఈ ఉత్పత్తుల్లో ఉండే కొన్నిరకాల రసాయనాలు అలెర్జీలను, ఇన్ఫెక్షన్లను ప్రేరేపిస్తాయి. కాబట్టి వేసవి కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంతవరకూ చర్మ సమస్యలు తలెత్తకుండా ఉండొచ్చు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కావాలంటే..ఈ విత్తనాలు తినాలి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
