Link Between Joint Pain and Exercise : కీళ్ల నొప్పులకు, వ్యాయామానికి ఉన్న లింక్ గురించి తేల్చి చెప్పిన పరిశోధకులు..!
సాక్షి లైఫ్ : కీళ్ల నొప్పులు, ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి వ్యాయామమే ప్రథమ చికిత్స అని వైద్యులు ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్నారు. అయితే, వ్యాయామం వల్ల కలిగే స్వల్పకాలిక ప్రయోజనాలు చాలా తక్కువని, కొన్నిసార్లు అసలు చికిత్స తీసుకోకపోవడానికి, వ్యాయామం చేయడానికి మధ్య పెద్దగా తేడా ఉండదని బ్రిటీష్ మెడికల్ జర్నల్ (BMJ) ప్రచురించిన తాజా అధ్యయనం షాకింగ్ నిజాలను వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
పరిశోధనలో..
సుమారు 13 వేల మందికి పైగా రోగులపై జరిగిన వివిధ క్లినికల్ ట్రయల్స్‌ను విశ్లేషించిన నిపుణులు ఈ క్రింది విషయాలను గుర్తించారు.మోకాలు, తుంటి లేదా చేతి కీళ్ల నొప్పులకు వ్యాయామం వల్ల కలిగే ఉపశమనం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటోంది.
వ్యాయామం చేసిన వారికి, ఎలాంటి చికిత్స తీసుకోని వారికి మధ్య నొప్పి తగ్గుదల విషయంలో గణనీయమైన వ్యత్యాసం కనిపించలేదు. ముఖ్యంగా మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ విషయంలో, కేవలం వ్యాయామంపైనే ఆధారపడటం వల్ల దీర్ఘకాలంలో పెద్దగా మార్పు రావడం లేదని పరిశోధకులు తేల్చారు.
మరి వ్యాయామం మానేయాలా..?
పరిశోధకులు వ్యాయామాన్ని పూర్తిగా వ్యతిరేకించడం లేదు. కానీ, ఆస్టియో ఆర్థరైటిస్‌కు 'వ్యాయామం ఒక్కటే మార్గం' అనే భావన మారాలని సూచిస్తున్నారు. ప్రతి రోగికి ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. శరీర తత్వం, నొప్పి తీవ్రతను బట్టి చికిత్స ఉండాలి.
బరువులు ఎత్తడం లేదా జిమ్ చేయడం కంటే, రోజువారీ పనులు ,నడక, మెట్లు ఎక్కడంపై దృష్టి పెట్టడం వల్ల నాణ్యమైన జీవనం సాధ్యమవుతుంది.
వ్యాయామంతో పాటు బరువు తగ్గడం, అవసరమైనప్పుడు మందులు లేదా ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులను కూడా అనుసరించడం మేలు.
కీళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం చేసేటప్పుడు విపరీతమైన నొప్పి కలిగితే వెంటనే ఆపివేయాలి. కేవలం 'వ్యాయామం చేస్తే తగ్గిపోతుంది' అని మొండిగా చేసే కంటే, ఆర్థోపెడిక్ నిపుణుల సలహాతో 'షేర్డ్ డిసిషన్ మేకింగ్' రోగి,డాక్టర్ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవడం పద్ధతిని పాటించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
