స్టెమ్ సెల్స్ పరిశోధనలో సంచలనం! : జుట్టు నెరియడానికి అసలు కారణం ఇదేనట..

సాక్షి లైఫ్ : వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం (Greying) సహజం. అయితే, ఇటీవల ఈ సమస్యపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. జుట్టు రంగు కోల్పోవడానికి మెలనోసైట్ స్టెమ్ సెల్స్ (Melanocyte Stem Cells - McSCs) కదలికలో లోపమే ప్రధాన కారణమని గుర్తించారు. ఈ కణాల కదలికను పునరుద్ధరిస్తే, జుట్టుకు సహజ రంగును తిరిగి తీసుకురావచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
జుట్టు నెరయడానికి అసలు కారణం ఏమిటి అంటే..?

జుట్టు నలుపు లేదా ఇతర రంగులో ఉండటానికి కారణం "మెలనిన్" (Melanin) అనే వర్ణద్రవ్యం. ఈ మెలనిన్‌ను ఉత్పత్తి చేసేవి మెలనోసైట్స్ అనే కణాలు. ఈ మెలనోసైట్స్ పుట్టుకకు మూలం - మెలనోసైట్ స్టెమ్ సెల్స్ (McSCs).

పరిశోధనలో..

సాధారణంగా, ఆరోగ్యవంతమైన వెంట్రుకల కుదురు (Hair Follicle) లో, మెలనోసైట్ స్టెమ్ సెల్స్ ఒక చోట (Bulge Zone - సురక్షిత ప్రాంతం) విశ్రాంతి తీసుకుని, మరో చోటుకు (Hair Germ - రంగు ఉత్పత్తి చేసే ప్రాంతం) కదులుతూ ఉంటాయి. రంగు ఉత్పత్తి చేసే ప్రాంతానికి చేరుకున్నప్పుడే అవి మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

 వయసు పెరిగే కొద్దీ లేదా ఇతర కారకాల వల్ల ఈ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ కణాలు తమ సురక్షిత ప్రాంతంలోనే "చిక్కుకుపోతాయి" (Get Trapped). కదలిక నిలిచిపోవడం వల్ల, ఆ స్టెమ్ సెల్స్ రంగును ఉత్పత్తి చేసే ప్రాంతానికి చేరలేవు. దీంతో మెలనిన్ ఉత్పత్తి జరగదు. ఫలితంగా నలుపు రంగులో ఉండాల్సిన వెంట్రుకలు తెల్లగా మారుతాయి. దీని అర్థం, రంగును ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం లేదు, కానీ అవి సరైన ప్రదేశంలోకి వెళ్లి, తమ పనిని చేయలేకపోతున్నాయి. ఇదొక టైమింగ్ లేదా కమ్యూనికేషన్ లోపంగా శాస్త్రవేత్తలు గుర్తించారు.  

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : white-hairs new-study research health-research researchers new-research melanin stem-cells-hair-greying true-cause-of-grey-hair melanocyte-stem-cells reverse-grey-hair hair-colour-restoration hair-pigment-stem-cells why-does-hair-turn-grey grey-hair-cure hair-biology-news
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com