తినే సమయంలో నీళ్లు తాగకూడదా..? ఏమౌతుంది..?
సాక్షి లైఫ్ : భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందా..? ఆహారం తిన్నప్పుడు జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభ మవుతుంది. ఆహారం కడుపులోకి ప్రవేశించిన తర్వాత, గ్యాస్ట్రిక్ రసం జీర్ణక్రియ కోసం ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. తినేటప్పుడు నీరు తాగడం వల్ల జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం అవ్వదు.
దీని కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడమేకాకుండా, మలబద్ధకం ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు లేదా తినడానికి ముందు నీరు తాగకూడదు. ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువగా లేదా తరచుగా నీరు తాగడం వల్ల వికారం, గుండెల్లో మంట , త్రేనుపు మొదలైన జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందుకోసం ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
అధిక బరువు..
తినేటప్పుడు నీరు తాగడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుందని వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మనం తినే ఆహారం, తినే సమయంలో నీళ్లు తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడం సక్రమంగా జరగదు. ఈ సమయంలో జీర్ణం కాని ఆహారం కొవ్వుగా మారుతుంది. దీని కారణంగా బరువు పెరగడం ప్రారంభమవుతుందని వారు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. టీబీ వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్..
ఇన్సులిన్..
భోజన సమయంలో ఎక్కువగా లేదా తరచుగా నీరు తాగడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
నీళ్లు తాగే అలవాటును ఎలా తగ్గించుకోవాలి..?
తినే సమయంలో నీళ్లు తాగే అలవాటు నుంచి బయటపడాలంటే ఉప్పు పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. సోడియం వల్ల దాహంగా అనిపిస్తుంది. అలాగే ఆయిల్ ఫుడ్ , స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు.
ఆహారాన్ని బాగా నమలండి. మీరు ఆహారాన్ని పూర్తిగా నమలడం ద్వారా, జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి.. శరీరంలో ఇన్సులిన్ తగ్గాలంటే ఏం చేయాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
