సాక్షి లైఫ్ : హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పానిష్ క్షయ వ్యాక్సిన్ MTBVAC క్లినికల్ ట్రయల్స్‌ను భారతదేశంలో ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌కు మొదటి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని ఒక పత్రికా ప్రకటన తెలిపింది.హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ టీబీ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ డెవలపర్ బయోఫ్యాబ్రి సహకారంతో భారత్ బయోటెక్ ఈ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది.
ట్రయల్స్..
MTBVAC భద్రత ,ఇమ్యునోజెనిసిటీని అంచనా వేయడానికి ట్రయల్స్ కీలకమైన భద్రత, ఇమ్యునోజెనిసిటీ , ఎఫిషియసీ ట్రయల్‌తో 2025లో ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు పరిశోధకులు.
ఇది కూడా చదవండి.. సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
మరింత ప్రభావవంతంగా..
మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనల తర్వాత, బయోఫ్యాబ్రి సీఈఓ అయిన ఎస్టేబాన్ రోడ్రిగ్జ్ "ప్రపంచంలో 28 శాతం టీబీ కేసులు పెరిగిపోతున్నదేశంలోని పెద్దలు,యుక్తవయస్కులలో పరీక్షించడం ఒక పెద్ద అడుగు" అని చెప్పారు. BCG (బాసిల్లస్ కాల్మెట్ అండ్ గురిన్) వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇది వంద సంవత్సరాల నుంచి ఊపిరితిత్తుల క్షయవ్యాధిపై చాలా పరిమిత ప్రభావాన్ని కలిగి ఉంది. త్వరలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా పనిచేయనుందని భారత్ బయోటెక్ తెలిపింది.
క్షయవ్యాధి నిర్మూలనకు..
భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. “క్షయవ్యాధి నిర్మూలనకు మరింత ప్రభావవంతమైన వ్యాక్సిన్ కోసం మా అన్వేషణలో భాగంగా ఈ రోజు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్‌తో గొప్ప ప్రోత్సాహాన్ని పొందగలిగాం. పెద్దలు, కౌమారదశలో ఉన్నవారిలో వ్యాధిని నివారించడానికి టీబీ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయాలనే మా లక్ష్యంతో నేడు ఒక పెద్ద అడుగు ముందుకు వేశామని చెప్పారు. టీబీ వ్యాక్సిన్‌లను తిరిగి ఆవిష్కరించే ఈ గొప్ప ప్రయత్నంలో బయో ఫ్యాబ్రీ ,డా. ఈస్టబ్యాన్ రోడ్రిగ్జ్ అండ్ డా. కార్లోస్ మార్టిన్‌లతో భాగస్వామ్యం కావడం మాకు గౌరవంగా ఉంది.” అని కృష్ణ ఎల్లా వెల్లడించారు.
ఇది కూడా చదవండి.. సమ్మర్ హెల్త్ : ఎండాకాలంలో ఈ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికలిగిస్తాయని మీకు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com