గోళ్లు కొరకడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు..? 

సాక్షి లైఫ్ : మీకు కూడా గోళ్లు కొరికే చెడు అలవాటు ఉందా..? టెన్షన్ లేదా అలసట వల్ల మాత్రమే కాదు, ఖాళీగా కూర్చున్నప్పుడు, ఏదోకటి ఆలోచిస్తూ గోళ్లు కొరికే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీరు కూడా వీరిలో ఒకరైతే ఈ చెడు అలవాటు మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చుపిస్తుందో తెలుసుకోండి.. 

  ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంట‌లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? 


గోళ్లు కొరకడం వల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ఈ బ్యాడ్ హ్యాబిట్ ను వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత తొందరగా పోదు. గోర్లు కొరకడం అలవాటు అనేది చాలా మందికి  చిన్నతనం నుంచే అలవడుతుంది. ఈ అలవాటును తేలికగా తీసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

గోళ్లు కొరుకుకోవడం ఎందుకు మంచిది కాదంటే..?

గోళ్లు కొరకడం వల్ల శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. మీ శరీరం చాలా ప్రమాదకరమైన బాక్టీరియాకు గురికావడం వల్ల స్కిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ అలవాటు గోళ్ల నిర్మాణాన్ని శాశ్వతంగా పాడుచేయడమే కాకుండా ఈ వ్యసనం వల్ల వచ్చే పరిశుభ్రత సంబంధిత సమస్యలు మీకు హాని కలిగించడమే కాకుండా మీతో పరిచయం ఉన్న వ్యక్తులకు కూడా పెద్ద సమస్యగా మారతాయి.


గోళ్లు కొరకడం వల్ల దంతాలను దెబ్బతినడమే కాకుండా చిగుళ్ళపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఇది మీ చిగుళ్ళకు సోకడమే కాకుండా వాటిని బలహీనం చేస్తుంది. ఇలా చేయడం వల్ల గోళ్ల చుట్టూ ఉన్న చర్మం పొడిబారడంతోపాటు రాలడం మొదలవుతుంది. ఇది పరిశుభ్రంగా కనిపించదు లేదా ఆరోగ్యానికి మంచిది కాదు.

గోళ్లు కొరకడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఇందులో అనేక బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి కడుపులో నులిపురుగుల సమస్య కూడా తలెత్తుతుంది.

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..    

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : stress harmful-to-health dental-problems mental-issues genetic-issues nail-biting nails bad-habit

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com