Tattoo Ink Weakens the Body’s Immune System: శరీర రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తున్న టాటూ సిరా.. తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

షేర్ చేయండి:
Tattoo Ink Weakens the Body’s Immune System: శరీర రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తున్న టాటూ సిరా.. తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

సాక్షి లైఫ్ : ప్రజెంట్ జనరేషన్ లో టాటూలు వేయించు కోవడం అనేది ఒక క్రేజ్‌గా మారింది. అయితే, చర్మంపై అందంగా కనిపించే ఈ రంగుల వెనుక ఆరోగ్యానికి పెను ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టాటూ కోసం వాడే సిరా కేవలం చర్మంపైనే ఉండదని, అది శరీరం లోపలికి వెళ్లి మన రోగనిరోధక వ్యవస్థను (Immune System) బలహీనపరుస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

సిరా.. 
చర్మంపై సూదితో సిరాను వేసినప్పుడు, అది అక్కడే స్థిరంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవం వేరేలా ఉందని 'పీఎన్ఏఎస్' (PNAS) జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం చెబుతోంది. టాటూ వేయించుకున్న కొద్ది నిమిషాల్లోనే సిరాలోని సూక్ష్మ కణాలు రక్తనాళాలు, లింఫాటిక్ వ్యవస్థ ద్వారా శరీర రక్షణ కేంద్రాలైన 'లింఫ్ నోడ్స్'కు చేరుకుంటాయి.

 మన శరీరంలోకి వచ్చే హానికరమైన పదార్థాలను చంపే 'మాక్రోఫేజెస్' అనే కణాలు ఈ సిరాను మింగేస్తాయి. ఫలితంగా ఆ కణాలు విషతుల్యమై చనిపోతున్నాయి. లింఫ్ నోడ్స్‌లో పేరుకుపోయిన ఈ సిరా వల్ల అక్కడ నెలల తరబడి 'ఇన్ఫ్లమేషన్' కొనసాగుతోంది.

వ్యాక్సిన్ల ప్రభావం కూడా..

ఈ పరిశోధనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ట్యాటూలు ఉన్న చోట లేదా దానికి దగ్గరగా ఉండే లింఫ్ నోడ్స్ ప్రభావితం కావడం వల్ల మనం వేయించుకునే టీకాల పనితీరుపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కోవిడ్-19 వంటి కొన్ని రకాల ఎంఆర్ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్ల ప్రభావం తగ్గే అవకాశం ఉందని ప్రాథమికంగా గుర్తించారు పరిశోధకులు.

క్యాన్సర్ ముప్పు..

స్వీడన్ , డెన్మార్క్‌లో సుమారు 12వేలమందిపై జరిపిన అధ్యయనాల ప్రకారం.. టాటూలు ఉన్నవారిలో 'లింఫోమా' అనే రక్త క్యాన్సర్ వచ్చే ముప్పు సుమారు 21శాతం నుంచి 29శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. టాటూ చిన్నదైనా, పెద్దదైనా అది శరీర రక్షణ వ్యవస్థను ప్రభావితం చేస్తోందని, ముఖ్యంగా ఎరుపు, నలుపు రంగు సిరాల్లోని రసాయనాలు ఎక్కువ హాని కలిగిస్తున్నాయని తేలింది.

ముందు జాగ్రత్తలు ..

ఒకవేళ మీరు ట్యాటూ వేయించుకోవాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. సిరాలో నికెల్, క్రోమియం, కోబాల్ట్ వంటి భారలోహాలు (Heavy Metals) లేకుండా చూసుకోవాలి. కేవలం గుర్తింపు పొందిన, పరిశుభ్రత పాటించే స్టూడియోలనే ఎంచుకోవాలి. వాడే సూదులు కొత్తవా కాదా అనేది గమనించాలి. ఇప్పటికే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చర్మ అలర్జీలు ఉన్నవారు ట్యాటూలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఇది కేవలం సమాచార ప్రయోజనాల కోసమే. పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.