Magnesium Supplements: మెగ్నీషియం సప్లిమెంట్లు ఎక్కుగా వాడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు!
సాక్షి లైఫ్ : ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో 'ఇన్‌ఫ్లుయెన్సర్లు' చెప్పే మాటలు విని విచక్షణారహితంగా హెల్త్ సప్లిమెంట్లు వాడటం ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా నిద్రలేమి, కండరాల నొప్పులు, ఒత్తిడి తగ్గించుకోవడానికి చాలామంది మెగ్నీషియం క్యాప్సూల్స్, లోషన్లు, స్ప్రేలను వాడుతున్నారు. అయితే, ఈ ధోరణిపై కోల్‌కతాకు చెందిన ప్రముఖ వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా మెగ్నీషియం వాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని, కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా గుండె,కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మెగ్నీషియం సప్లిమెంట్లకు దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా శరీరంలో అదనంగా ఉన్న మెగ్నీషియంను కిడ్నీలు బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రక్రియ జరగదు. దీనివల్ల రక్తంలో మెగ్నీషియం స్థాయిలు విపరీతంగా పెరిగి (Hypermagnesemia), ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
రక్తంలో మెగ్నీషియం మోతాదు మించితే గుండె లయ తప్పడం (Arrhythmia), బీపీ పడిపోవడం, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
లోషన్లు, స్ప్రేల వెనుక ఉన్న నిజా నిజాలు..
మార్కెట్లో లభించే మెగ్నీషియం లోషన్లు రాసుకుంటే వెంటనే ఫలితం ఉంటుందనే ప్రచారంలో శాస్త్రీయత లేదని నిపుణులు కొట్టి పారేస్తు న్నారు. చర్మం ద్వారా మెగ్నీషియం శరీరంలోకి వెళ్లడం చాలా తక్కువని, ఇది కేవలం మభ్యపెట్టే ప్రక్రియ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు.
అధిక మోతాదులో మెగ్నీషియం వాడటం వల్ల మైకం కమ్మడం (Dizziness), అస్పష్టమైన మాటలు, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు పేషెంట్లు ఇవి వాడిన మరుసటి రోజు 'మత్తు'లో ఉన్నట్లు అనిపిస్తోందని ఫిర్యాదు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఒక ట్రెండ్‌లా మారిపోయింది...
మెగ్నీషియం అనేది ఓమేగా-3 లాగే ఇంటర్నెట్‌లో ఒక ట్రెండ్‌లా మారిపోయింది. కానీ ఇది అందరికీ సురక్షితం కాదు. కండరాల నొప్పులకు ఇంజక్షన్ రూపంలో ఇచ్చే మెగ్నీషియంను గుర్రాలకు మెర్సీ కిల్లింగ్ (Euthanasia) ప్రసాదించడానికి కూడా వాడతారనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి, సప్లిమెంట్లు ఆర్డర్ చేసే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
