Higher Stroke Risk Among People Below 45 : కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక : మందుల వాడకంలో జాగ్రత్త..! 45 ఏళ్ల లోపు వారికే పక్షవాతం ముప్పు ఎక్కువ..!

షేర్ చేయండి:
Higher Stroke Risk Among People Below 45 : కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక : మందుల వాడకంలో జాగ్రత్త..! 45 ఏళ్ల లోపు వారికే పక్షవాతం ముప్పు ఎక్కువ..!

సాక్షి లైఫ్ : దేశంలో పక్షవాతం (స్ట్రోక్) మహమ్మారి యువతను సైతం వదలడం లేదు. తాజాగా వెలువడిన 'నేషనల్ స్ట్రోక్ రిజిస్ట్రీ' గణాంకాల ప్రకారం, భారత్‌లో పక్షవాతం బారిన పడుతున్న ప్రతి ఏడుగురిలో ఒకరు సుమారు 13.8శాతం 45 ఏళ్ల లోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, సాధారణంగా వాడే కొన్ని యాంటీబయాటిక్ , థైరాయిడ్ మందుల విషయంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

 

 పక్షవాతం: 45 ఏళ్ల లోపు వారికే ముప్పు ఎక్కువ..!

ఐసీఎంఆర్ (ICMR) నేతృత్వంలో 30 ఆసుపత్రుల్లోని 34,792 కేసులను విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించారు. స్ట్రోక్ బారిన పడిన మూడు నెలల తర్వాత 27.8 శాతం మంది మరణిస్తుండగా, 29.7 శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. అధిక రక్తపోటు 74.5శాతం, పొగాకు వాడకం 28.5శాతం, మధుమేహం 27.3శాతంప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

కేవలం 20.1 శాతం మంది మాత్రమే నిర్ణీత 'గోల్డెన్ అవర్' 4.5 గంటల లోపు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దాదాపు 37.8 శాతం మంది లక్షణాలు కనిపించిన 24 గంటల తర్వాతే చికిత్స కోసం వస్తున్నారు.

 మందుల భద్రతపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. 

డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI), CDSCO సాధారణంగా వాడే రెండు మందుల ప్యాకెట్లపై అదనపు హెచ్చరికలు ఉండాలని ఆదేశించాయి. 

డాక్సీసైక్లిన్ (Doxycycline - యాంటీబయాటిక్)..

శ్వాసకోస ఇన్ఫెక్షన్లు, మొటిమలు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు వాడే ఈ మందు వల్ల కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

గమనించాల్సిన లక్షణాలు: అశాంతి (Restlessness), ఆందోళన (Anxiety), చిరాకు, కళ్లు తిరగడం.

కార్బిమజోల్ (Carbimazole).. 

హైపర్ థైరాయిడిజం చికిత్సలో వాడే ఈ మందు వల్ల 'అగ్రాన్యులో సైటోసిస్' (Agranulocytosis) అనే అరుదైన రక్త సమస్య వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల తెల్ల రక్తకణాలు వేగంగా పడిపోతాయి. జ్వరం, గొంతు నొప్పి లేదా వివరించలేని ఇన్ఫెక్షన్లు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే మూడు గంటల్లోపు వెంటనే నిపుణులైన న్యూరాలజిస్టును సంప్రదించాలి. అలాగే, వైద్యులు సూచించిన మందుల విషయంలో కొత్తగా ఏవైనా మార్పులు గమనిస్తే నిర్లక్ష్యం చేయవద్దు.

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.