Mental Stress Affect : మానసిక ఒత్తిడి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందా..?
సాక్షి లైఫ్ : శారీరక శక్తికి ఆహారమే ప్రాథమిక ఆధారం. ముఖ్యంగా జింక్, మెగ్నీషియం అధికంగా ఉండే బాదం, అక్రూట్లు, గుమ్మడి గింజలు వంటివి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. దానిమ్మ, పుచ్చకాయ వంటి పండ్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఒత్తిడి వల్ల శరీరంలో 'కార్టిసోల్' అనే హార్మోన్ పెరుగుతుంది, ఇది లైంగిక ఆసక్తిని తగ్గిస్తుంది. అతిగా ఆలోచించడం (Overthinking) పని ఒత్తిడి వల్ల 89శాతం మంది పురుషులు ప్రభావితమవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.
ధూమపానం, మద్యపానం వల్ల రక్తనాళాలు దెబ్బతిని, అవయవాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అలాగే, తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. క్రమం తప్పకుండా చేసే నడక లేదా వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 'కెగెల్' వంటి ప్రత్యేక వ్యాయామాలు పెల్విక్ కండరాలను బలోపేతం చేసి సామర్థ్యాన్ని పెంచుతాయి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ప్రజెంట్ జనరేషన్ కాలంలో 23-35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు అధిక పని ఒత్తిడి, 'బర్న్ అవుట్' (Burnout) వల్ల త్వరగా అలసిపోతున్నారు, ఇది వారి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శక్తినిచ్చే ప్రత్యేక ఆహార పదార్థాల జాబితా? ఒత్తిడిని తగ్గించే సులభమైన చిట్కాలు? లైంగిక జీవితంలో చేయకూడని తప్పులు, జాగ్రత్తలు..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సి.ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు అందించారు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
