Detection of COPD and Asthma : ఏఐ యాప్‌తో సీఓపీడీ, ఆస్తమా గుర్తింపు.. 

షేర్ చేయండి:
Detection of COPD and Asthma : ఏఐ యాప్‌తో సీఓపీడీ, ఆస్తమా గుర్తింపు.. 

సాక్షి లైఫ్ : దగ్గు శబ్దాన్ని విశ్లేషించి ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించే సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన ఒక స్టార్టప్‌ రూపొందించిన 'శ్వాస' (Shwaasa/Swaasa) అనే కృత్రిమ మేధ (AI) ఆధారిత మొబైల్ యాప్‌.. సీఓపీడీ (COPD), ఆస్తమా వంటి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను గుర్తించడంలో సమర్థంగా పనిచేస్తుందని ఎయిమ్స్‌ (AIIMS) వైద్యులు ధ్రువీకరించారు.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

స్పిరోమెట్రీ పరీక్ష..

సాధారణంగా ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవడానికి 'స్పిరోమెట్రీ' పరీక్ష అవసరం. దీనికి ఖరీదైన పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది కావాలి. కానీ ఈ యాప్‌తో ఆ అవసరం లేదు. రోగి తన స్మార్ట్‌ఫోన్ మైక్రోఫోన్ ముందు దగ్గితే చాలు ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవచ్చు. యాప్‌లోని ఏఐ సాఫ్ట్‌వేర్ ఆ దగ్గు శబ్దాన్ని సెకన్లలో విశ్లేషిస్తుంది.

 కేవలం ఎనిమిది నిమిషాల్లోనే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా సీఓపీడీ, ఆస్తమా వంటి లక్షణాలు ఉన్నాయా అనేది స్పష్టం చేస్తుంది. హర్యానాలోని బల్లబ్‌గఢ్‌లో 460 మందిపై ఎయిమ్స్‌ నిర్వహించిన అధ్యయనంలో వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయంటే..? ఆరోగ్యవంతులను, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులను వేరు చేయడంలోనూ ఈ యాప్ 90శాతం ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. సీఓపీడీ, ఆస్తమా వంటి నిర్దిష్ట వ్యాధులను గుర్తించడంలో 82శాతం నుంచి 87శాతం వరకు ఖచ్చితత్వం నమోదైంది. ఈ యాప్ ద్వారా టీబీని కూడా గుర్తించే అవకాశంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాలకు వరంలాంటిది.. 

దేశంలో సీఓపీడీ బాధితుల సంఖ్య పెరుగుతున్నా, జిల్లా ఆసుపత్రుల్లో కూడా స్పిరోమెట్రీ సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏఐ యాప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) కీలక పాత్ర పోషిస్తుందని ఎయిమ్స్‌ డాక్టర్ హర్షల్ రమేష్ సాల్వే తెలిపారు. ఇప్పటికే కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో దీనిని వినియోగిస్తున్నారు. ఇది ప్రాథమిక పరీక్ష (Screening) మాత్రమే. తుది నిర్ధారణ కోసం వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.