చూపు మందగించే ముందు కనిపించే లక్షణాలు..
సాక్షి లైఫ్ : ఇటీవల కాలంలో కంటి సంబంధిత సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. కొంతమందిలో చిన్నతనంలోనే కంటి చూపు మందగిస్తోంది. దీంతో కళ్లద్దాలను వాడాల్సిన పరిస్థితి వస్తోంది. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఎల్లప్పుడూ కనిపిస్తుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందనికొన్ని సార్లు చూపు కూడా కోల్పోవాల్సి వస్తుంద వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ముందుగా కంటి చూపు మందగిస్తుంది తెలిపే లక్షణాల గురించి తప్పనిసరిగా తెలుసుకొని తద్వారా జాగ్రత్తపడాలని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
పోషకాహార లోపమే..
కంటి చూపు మందగించడానికి పోషకాహార లోపమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇతర కారణాల వల్ల కూడా కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే కంటి సమస్యలు సాధార ణంగా ఎవరికైనా వస్తుంటాయి. తరచూ కళ్లు నొప్పిగా అనిపిస్తున్నా లేదా తలనొప్పి తరచూ వస్తున్నా.. కంటి సమస్యలు ఉన్నాయేమోనని అనుమానించాలి.
వైద్యపరీక్షలు..
వెంటనే డాక్టర్‌ను కలిసి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉందని తేలితే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో కళ్లు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లకు ఎలాంటి తీవ్రమైన సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడడంవల్ల కంటి చూపు పోకుండా కాపాడడానికి వీలవుతుంది. కొందరికి చీకటి పడుతున్న కొద్దీ కళ్లు సరిగ్గా కనిపించవు. దీన్నే రేచీకటి అంటారు. ఈ సమస్య ఉన్నవారి కళ్లు త్వరగా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి.కాబట్టి వీళ్లు వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
కళ్లు పొడిబారి..
కంప్యూటర్ ఎదుట గంటల తరబడి కూర్చున్నా.. లేదా నీళ్లను తక్కువగా తాగినా.. కళ్లు పొడిబారుతుంటాయి. అయితే ఈ రెండు కారణాలు కాకున్నా.. కళ్లు అలాగే పొడిబారుతుంటే.. కళ్లలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.కంటి చూపు అస్పష్టంగా ఉండడం చాలా మందికి జరుగుతుంటుంది. కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలను ఎక్కువ సేపు చూస్తే కళ్లు మసకబారినట్లు కనిపిస్తాయి.
కళ్లు దెబ్బతినే అవకాశాలు..
చూపు స్పష్టంగా ఉండదు. తరువాత కొంత సేపటికి మళ్లీ బాగానే కనిపిస్తుంది. అయితే ఇలా కాకుండా ఎల్లప్పుడూ కళ్లు మసకగా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కళ్లు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇక కొందరికి కళ్లతో ఒక ప్రత్యేక కోణంలో పరిసరాలను చూసినప్పుడు అవి కనిపించవు. ఇలా గనక ఎవరికైనా జరుగుతుంటే వెంటనే డాక్టర్‌ను కలవాల్సిందే. లేదంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి ఎవరిలో అయినా ఈ లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కంటి చూపును కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
