బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:
బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి..?

సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూ లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలను పోలి ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు దగ్గు, విరేచనాలు, జ్వరంతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, కండరాల నొప్పి, ముక్కు కారటం, గొంతు నొప్పి కూడా అనిపించవచ్చు.బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని వేరే గదిలో ఉంచడం మంచిది. లేకపోతే మరొకరికి సోకే ప్రమాదం ఉంది.

డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్‌ని కొన్ని రకాల పరీక్షల సహాయంతో సులభంగా గుర్తించవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోవడం, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఈ వ్యాధుని నివారించడానికి సమర్థవంతమైన మార్గం అని వైద్యులు అంటున్నారు.
 
 బర్డ్ ఫ్లూ రాకుండా ఏం చేయాలి..?

బర్డ్ ఫ్లూ బారిన పడిన ప్రాంతాల్లో నివసించే వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. అంతేకాదు కోళ్ల ఫారాలకు వెళ్ళినప్పుడు మాస్క్  ధరించాలి. ఒకవేళ బర్ద్ ఫ్లూ లక్షణాలు ఏమైనా కనిపిస్తే సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా మీరు తీవ్రమైన సమస్యల నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుంది.   

ఇది కూడా చదవండి..  వీగన్‌ డైట్‌తో నష్టాలు కూడా ఉన్నాయా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.