సీజనల్ వ్యాధులకు సరైన ఔషధం ఇది..

సాక్షి లైఫ్ : తిప్పతీగ ఆకు.. దీనిని ఇంగ్లిష్ లో గిలోయ్ అంటారు. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ ఆకు డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ మొదలైన వాటికి చాలాబాగా పనిచేస్తుంది. పచ్చి ఆకు తోపాటు, క్యాప్సూల్స్, జ్యూస్, పౌడర్ అన్నీ నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, మధుమేహం లేదా ఆర్థరైటిస్ నుంచి బయటపడటానికి ఎంతో బాగా పనిచేస్తుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.  

  ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను తొలగించడానికి లేదా రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు అనేక వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్రపోషిస్తుంది. ఇంతకీ ఏమిటి ఆ ఆకు అంటే..? తిప్పతీగ ఆకు.. అవును.. తిప్పతీగ ఆకు తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.. అవేంటంటే..?  

డయాబెటిక్.. 

మధుమేహం విషయంలో కూడా తిప్పతీగ ఆకులు, కాండం లేదా వేరుతో కషాయాలను తయారు చేసుకుని తాగడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయిని అద్భుతమైన రీతిలో నియంత్రిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, అసాధారణమైన ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


ఒక వరం.. 

ఆర్థరైటిస్‌లో తిప్పతీగ ఒక వరంలా పనిచేస్తుంది. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఎండబెట్టి పొడి చేసి రాత్రి వేడి పాలతో తాగి నిద్రిస్తే.. ఇది మీ నిద్రను మెరుగుపరచడమే కాకుండా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.


 డైజేషన్.. 

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో తిప్పతీగకు పోటీ లేదు. దీనిని తీసుకోవడం ద్వారా గ్యాస్, అసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యలు రాకుండాచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తిప్పతీగ ఆకుల రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తికి అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి.

స్ట్రెస్.. 

తిప్పతీగ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. అంతేకాదు ఇది ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. టాక్సిన్స్ తొలగిపోయిన తర్వాత, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగితుంది.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

  ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?  

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : stress diabetes healthy-food diseases seasonal-health-issues type-2diabetes immune-system viral-fever giloy giloy-amazing-health-benefits rain-season
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com