Vitamin K Importance : నవజాత శిశువులకు విటమిన్ 'కె' ఎందుకు ఇంపార్టెంట్ అంటే..? 

సాక్షి లైఫ్ : నవజాత శిశువుల (Newborns) ఆరోగ్య సంరక్షణలో భాగంగా పుట్టిన వెంటనే వైద్యులు తప్పనిసరిగా ఇచ్చే కీలకమైన ఇంజెక్షన్లలో 'విటమిన్ కె షాట్' (Vitamin K Shot) ఒకటి. ఈ ఒక్క ఇంజెక్షన్ శిశువులను ప్రాణాంతక రక్తస్రావ సమస్యల (Dangerous Bleeding) నుంచి కాపాడుతుంది. అయినప్పటికీ, ఇటీవలి కాలంలో కొంతమంది తల్లిదండ్రులు ఈ ముఖ్యమైన ఇంజెక్షన్‌ను తమ బిడ్డలకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

  విటమిన్ 'కె' ఇంజెక్షన్ తిరస్కరణ వెనుక ఉన్న కారణాలు ఏమిటి..?

విటమిన్ కె ఇంజెక్షన్ తీసుకోకపోతే శిశువులకు ఎదురయ్యే ముప్పు ఎంత? వైద్య నిపుణులు దీనిపై ఏమని హెచ్చరిస్తున్నారు..? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.. 

విటమిన్ "కె" షాట్ ఎందుకు అవసరం..?  

నవజాత శిశువుల శరీరంలో రక్తం గడ్డకట్టడానికి (Blood Clotting) అవసరమైన విటమిన్ కె స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. 
 తల్లి నుంచి శిశువుకు గర్భంలో ఉన్నప్పుడు విటమిన్ కె తక్కువ మొత్తంలో చేరుతుంది.విటమిన్ కె ను సహజంగా ఉత్పత్తి చేసే పేగులోని మంచి బ్యాక్టీరియా (Gut Bacteria) పసికందులలో పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. తల్లిపాలు తాగే శిశువుల్లో పాల ద్వారా అందే విటమిన్ కె పరిమాణం రక్షణకు సరిపోదు.

 విటమిన్ కె లోపం కారణంగా 'విటమిన్ కె లోపం రక్తస్రావం' (VKDB - Vitamin K Deficiency Bleeding) అనే తీవ్రమైన సమస్య వస్తుంది. ఈ రక్తస్రావం శరీరం లోపల, ముఖ్యంగా మెదడులో (Bleeding in the Brain) కూడా జరగవచ్చు. ఇది మెదడు దెబ్బతినడానికి (Brain Damage) లేదా మరణానికి కూడా దారి తీయవచ్చు. ఈ ఇంజెక్షన్ ఒకే ఒక్క డోస్‌తో ఆరు నెలల వరకు సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది.

తల్లిదండ్రులు ఎందుకు 'వద్దు' అంటున్నారు అంటే..?

వైద్య నిపుణులు విటమిన్ "కె" షాట్‌ను తప్పనిసరిగా సిఫార్సు చేస్తున్నప్పటికీ, కొన్ని అపోహలు, పాత పరిశోధనల కారణంగా తల్లిదండ్రులు దీనిని తిరస్కరిస్తున్నారు.

క్యాన్సర్ ఆందోళన (Cancer Fear).. 

1990ల ప్రారంభంలో నిర్వహించిన ఒక చిన్న అధ్యయనం విటమిన్ కె ఇంజెక్షన్‌కు, శిశువులలో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్‌కు మధ్య సంబంధం ఉండవచ్చని సూచించింది. అయితే, తరువాత జరిగిన అనేక లోతైన అధ్యయనాలు ఈ వాదనను పూర్తిగా తప్పని నిరూపించాయి. విటమిన్ కె ఇంజెక్షన్ సురక్షితమని వైద్య ప్రపంచం ఏకాభిప్రాయానికి వచ్చింది.
ఇంజెక్షన్‌లో ఉండే ప్రిజర్వేటివ్స్ లేదా ఇతర రసాయనాలపై కొందరు తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయి. అయితే, చాలా ఆసుపత్రులు ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ లేని విటమిన్ కె ను ఉపయోగిస్తున్నాయి.

ఇంజక్షన్ పెయిన్ (Pain).. 

 పసికందుకు నొప్పి కలుగుతుందనే ఉద్దేశంతో, లేదా తమ బిడ్డకు ఏ ఇంజెక్షన్ ఇవ్వకూడదనే 'సహజ ప్రసవ' (Natural Birth) ఆలోచనల కారణంగా కూడా కొందరు తల్లిదండ్రులు దీన్ని తిరస్కరిస్తున్నారు.

నోటి ద్వారా డ్రాప్స్ (Oral Drops) .. 

ఇంజెక్షన్‌కు బదులుగా నోటి ద్వారా విటమిన్ "కె" డ్రాప్స్‌ను ఇవ్వాలని కొందరు కోరుకుంటారు. కానీ, నోటి ద్వారా ఇచ్చిన విటమిన్ కె ను శరీరం సరిగా గ్రహించలేదు. పూర్తి రక్షణ కోసం అనేక డోస్‌లు అవసరం, అది కూడా ఇంజెక్షన్ అంత ప్రభావవంతంగా ఉండదు. "నవజాత శిశువుకు విటమిన్ "కె"షాట్ ఇవ్వడం అనేది ఒక చిన్నపాటి అసౌకర్యం మాత్రమే. కానీ, దానిని తిరస్కరించడం వల్ల కలిగే మెదడు రక్తస్రావం, ప్రాణాపాయం చాలా తీవ్రమైనవి. తల్లిదండ్రులు పాత అపోహలను నమ్మకుండా, ఆధునిక శాస్త్ర ఆధారిత వైద్య సలహాలను పాటించాలి," అని పీడియాట్రిషియన్లు నొక్కి చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : newborn-babies new-born-baby vitamin-k vitamin-k2 vitamin-deficiency essential-vitamins vitamin doctors
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com