Controlling Sugar Levels : షుగర్ లెవల్స్ కంట్రోల్ మీ చేతుల్లోనే..! అదుపు తప్పితే అనర్థమే..  

షేర్ చేయండి:
Controlling Sugar Levels : షుగర్ లెవల్స్ కంట్రోల్ మీ చేతుల్లోనే..! అదుపు తప్పితే అనర్థమే..  

సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల నేడు 'మధుమేహం' (Diabetes) ఇంటింటి వ్యాధిగా మారింది. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలోనూ అధికంగా కనిపిస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోతే అది గుండె, కిడ్నీలు, కళ్లు వంటి ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకర జీవనానికి, శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి ఏమేం ప్రధానం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 రోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తృణధాన్యాలను తీసుకోవాలి. చక్కెర, మైదా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఎప్పటికప్పుడూ తగినంత నీరు తాగాలి. కండరాల దృఢత్వం కోసం యోగా లేదా చిన్నపాటి బరువులెత్తడం వంటి వ్యాయామాలు చేయాలి.

ఆహార నియమాలు.. 
 
 ఆకుకూరల్లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఆల్మండ్స్, వాల్ నట్స్ వంటివి శరీరానికి తక్షణ శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. చిరుధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. నెయ్యి పరిమితంగా తీసుకుంటే విటమిన్ల గ్రహణకు తోడ్పడుతుంది. జబ్బున పడ్డాక చికిత్స తీసుకోవడం కంటే, రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. 'నా ఆరోగ్యం నా బాధ్యత' అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి" అని వైద్యులు సూచిస్తున్నారు.  

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.