IDF latest report : ముంచుకొస్తున్నమధుమేహం ముప్పు.. రెండో స్థానంలో భారత్

షేర్ చేయండి:
IDF latest report : ముంచుకొస్తున్నమధుమేహం ముప్పు.. రెండో స్థానంలో భారత్

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ‘మధుమేహం’ (Diabetes) మహమ్మారిలా విస్తరిస్తోంది. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇలాగే కొనసాగితే రాబోయే 25 ఏళ్లలో పరిస్థితి మరింత భయంకరంగా మారనుందని ‘ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్’ (IDF) తాజా నివేదిక హెచ్చరించింది. 2024లో దాదాపు 58 కోట్ల మందిగా ఉన్న మధుమేహ బాధితుల సంఖ్య, 2050 నాటికి ఏకంగా 90 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నగరాల్లోనే మధుమేహ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నివసించే వారే డయాబెటిస్ బారీన పడుతున్నారు. 

ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

ఇది కూడా చదవండి..Health care : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే చెర్రీస్..

ఇది కూడా చదవండి..Methi side effects : మెంతులు ఎక్కువగా తీసుకున్నా సమస్యే.. 

 

 2024లో 40 కోట్లుగా ఉన్న బాధితులు, 2050 నాటికి 65.5 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బాధితుల సంఖ్య దాదాపు 19.8 కోట్ల వద్దే స్థిరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మధ్య ఆదాయ దేశాలలోనే ఈ వ్యాధి వ్యాప్తి అత్యంత వేగంగా ఉండబోతోంది. 

అగ్రస్థానంలో చైనా.. భారత్‌ ఎక్కడ? ప్రపంచ మధుమేహ భారంలో ఆసియా దేశాలే ముందున్నాయి. 2025లో ‘లాన్సెట్ డయాబెటిస్ ఎండోక్రినాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం టాప్ దేశాల జాబితా ఎలా ఉందో ఇప్పుడు చూద్దామ్..   

ప్రపంచ జనాభా పరంగా రాబోయే దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం  చైనా 14.8 కోట్ల జనాభాతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, 2050 నాటికీ అదే స్థానం నిలుపుకుంటుందని అంచనా వేస్తున్నారు. భారత్ ప్రస్తుతం 9 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే అమెరికా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ, 2050 నాటికి ఆ స్థానంలో పాకిస్థాన్ చేరే అవకాశం ఉందని అంచనాలు వెలువడటం విశేషం. ఈ మార్పులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు, వనరుల వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"ఈ శతాబ్దం ఆరంభం నుంచి మధుమేహం అదుపులేకుండా పెరుగుతోంది. దీని వేగాన్ని అడ్డుకోవాలంటే ఇప్పుడే కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే రాబోయే తరాలకు ఆరోగ్య సంక్షోభం తప్పదు" అని ఇండియా డయాబెటిస్ రీసెర్చర్ ఏ. రామచంద్రన్ పేర్కొన్నారు. 

నియంత్రణకు ఏం చేయాలి..?  

మధుమేహ వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతులాహారం, బరువు అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వైద్యనిపుణులు చెప్పే పలు జీవనశైలి మార్పుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. 

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..High-Calorie Fruits : అధిక కేలరీస్ ఉండే ఫ్రూట్స్ గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..For stress less life : మెంటల్ స్ట్రెస్ తగ్గించే ఆరోగ్యకరమైన నియమాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.