సాక్షి లైఫ్ : ఆరోగ్యం విషయంలో అన్నిటికంటే ముందు ఎక్కువమంది ప్రాధాన్యతనిచ్చేది చర్మ సంరక్షణకే.. శరీరంలోని అన్ని అవయవాలతోపాటు బాహ్య సౌందర్యం కూడా చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారం మొదట బాహ్య సౌందర్యంపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆహార ఎంపిక అనేది చర్మం ఆరోగ్య రూపాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు చర్మ సమస్యలను మరింతగా పెంచుతుంది. అయితే విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలలో సమృద్ధిగా ఉన్న ఆహారం చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
అటువంటి వాటిలో నారింజ, ఉసిరికాయ, నిమ్మ, ఆకు కూరలు,టొమాటోలు వంటి ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. చర్మ సంరక్షణ విషయంలో ముఖ్యంగా బాదంపప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, అతినీలిలోహిత కిరణాల నుంచి రక్షించడంలో చాలా బాగా పనిచేస్తాయి.
విటమిన్ "ఇ" ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి, రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య సంకేతాలను ఎదుర్కోవడానికి ప్రయోజనకరంగా ఉంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఆయుర్వేదం, సిద్ధ, యునాని గ్రంథాలు సైతం బాదం చర్మ ఆరోగ్యానికి మంచిదని, చర్మ కాంతిని పెంచుతుందని చెబుతున్నాయి.
హైడ్రేషన్..
చర్మం స్థితిస్థాపకత మొత్తం పనితీరును నిర్వహించడానికి తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. రోజంతా తగినంత హైడ్రేషన్ గా ఉండేలా చూసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నీళ్లతో పాటు, సరైన చర్మ ఆరోగ్యాన్ని అందించడానికి రెగ్యులర్ డైట్‌లో సూప్‌లు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఒత్తిడి..
ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది చర్మంతోపాటు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. దినచర్యలో యోగా, ధ్యానం, సానుకూల ఆలోచన , లోతైన శ్వాస వంటివి చేయడం వల్ల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇవన్నీ ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతాయి.
అంతేకాదు కొన్ని జీవనశైలి అలవాట్లు చర్మం ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. మెరుగైన చర్మ ఆరోగ్యం కోసం ఈ కింది వాటిని వదిలేయాలి..
ధూమపానం: ఇది ఊపిరితిత్తులకు హాని కలిగించడమే కాకుండా, వృద్ధాప్య ముడతలు ఏర్పడటాన్ని వేగవంతం చేస్తుంది.
·అధిక ఆల్కహాల్ తీసుకోవడం: ఇది చర్మాన్ని నిర్జలీకరణం చేస్తుంది. ఇది చర్మాన్ని నిస్తేజంగా, నిర్జీవంగా మారుస్తుంది.
నిద్ర : చర్మ సౌందర్యం , పునర్ యవ్వనాన్ని పొందేలా చేయడానికి తగినంత విశ్రాంతి, నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ చిట్కాలు చర్మాన్నిరక్షించడంలోనేకాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడతాయి.
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com