కొలెస్ట్రాల్ తగ్గించడానికి సరైన మార్గాలు ఇవే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. కొలెస్ట్రాల్ ఒక రకమైన కొవ్వు పదార్థం, ఇది శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, కొలెస్ట్రాల్ అధిక స్థాయిలు ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. కాబట్టి, కొలెస్ట్రాల్ ను నియంత్రించ డానికి కొన్ని సరైన మార్గాలు పాటించడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వ్యూహాలు ,ఆహార మార్పులు గురించి తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

 

ఆరోగ్యకరమైన ఆహారం.. 

కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం మంచిది. గింజలు, పండ్లు , కూరగాయలు వంటి ఫైబర్ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం ఉత్తమం.

వ్యాయామం..

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. నడక, జాగింగ్, యోగా, సైక్లింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం చాలా అవసరం. కార్డియో ఎక్సర్ సైజెస్ మంచి ఫలితాలను ఇస్తాయి.

ఆరోగ్యకరమైన బరువు..

బరువు పెరగడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. బరువు తగ్గడం ద్వారా HDL (మంచి కొలెస్ట్రాల్) పెరిగి, LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గుతుంది.

అల్కహాల్ మానేయడం..

ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల  కొలెస్ట్రాల్ స్థాయిలపై తీవ్ర ప్రభావం పడుతుంది.  

పొగ తాగడం..

పొగ తాగడం  కూడా కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. తద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గి, చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగే అవకాశం ఉంటుంది.

 ఒత్తిడి నిర్వహణ.. 

ఒత్తిడి తగ్గించడం కూడా కొలెస్ట్రాల్ నియంత్రణకు మేలు చేస్తుంది. అందుకోసం యోగా, ధ్యానం, నిద్ర చాలా ముఖ్యం.

 

ఇది కూడా చదవండి..  ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.