డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..  

సాక్షి లైఫ్ : ప్రతిరోజూ ఉదయం పరగడుపున కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆయుర్ధాయం పెంచుకోవడంతోపాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా  ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మరింత హెల్దీగా ఉండొచ్చని వైద్యనిపుణు లు చెబుతున్నారు. రోజులో మనం తినే ఆహారంలోంచి అధిక మొత్తంలో పోష‌కాలు, శ‌క్తిని  ఉద‌యం తీసుకునే అల్పాహారం నుంచే శ‌రీరం గ్ర‌హిస్తుంది. రాత్రి తినిపడుకున్న దగ్గర నుంచి పొద్దున్నే నిద్ర లేచే దాకా దాదాపు 7 నుంచి 8 గంటలు పడుతుంది. కాబట్టి ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ఆరోగ్య‌వంత‌మైంది అయి ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

రోజంతా యాక్టివ్‌గా..

ఉద‌యం ఎక్కువ మొత్తంలో పోషకాహారాన్ని తీసుకోవాల‌ని చెబుతున్నారు. ఈ విషయంలో పోష‌కాలు, విటమిన్లు  క‌లిగిన చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని ఉద‌య‌మే తీసుకోవాలని డైటీషన్ల అంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో పోష‌కాలు, శ‌క్తి మ‌న‌ శరీరానికి ల‌భిస్తాయి. అంతేకాదు ఇవి మ‌న‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయి. శ‌రీరంలో శ‌క్తి స్థాయిల‌ను పెంచుతాయి.ఎంత ప‌నిచేసినా అల‌స‌ట అనేది రాకుండా..ఉత్సాహంగా, చురుగ్గా ఉండడానికి శ‌రీర జీవక్రియ పెరగడానికి ఉపయోగపడుతాయి. క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. క‌నుక ఉద‌యం మ‌నం తినే ఆహారానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐతే ఉద‌యం ఎలాంటి ఆహరం తీసుకోవడం ద్వారా  మరింత హెల్దీ గా ఉండొచ్చనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ప్రతిరోజూ ఎటువంటి ఆహారాల‌ను తీసుకుంటే శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి, పోష‌కాలు రెండూ ల‌భిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.. ! 

 ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌తోపాటు పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను కూడా తిన‌వ‌చ్చు. ఇవి శ‌రీరానికి కావ‌ల్సిన ఎల‌క్ట్రోలైట్స్‌ను అందిస్తాయి. దీంతో శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. వేస‌వితాపం త‌గ్గుతుంది. ఎండ దెబ్బ నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. పుచ్చ‌కాయ‌ల్లో విట‌మిన్ సి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. 

రోగ నిరోధ‌క శ‌క్తి.. 

అలాగే విట‌మిన్ బి6, లైకోపీన్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి.ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేశాక ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌లు తినాలి. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం రాకుండా చూస్తుంది. శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్‌తో పాటు బొప్పాయి పళ్లు తిన‌డం అల‌వాటు చేసుకోవాలి.

 ఉద‌యం టిఫిన్ చేసిన త‌రువాత పండ్లు లేదా కూర‌గాయ‌ల ర‌సాల‌ను తాగ‌వ‌చ్చు. క్యారెట్‌, బీట్‌రూట్‌, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌తో త‌యారు చేసిన జ్యూస్‌ల‌ను తాగినా ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన అన్ని ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. రాత్రంతా నీటిలో నాన‌బెట్టిన బాదంపప్పును ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ తో తీసుకోవాలి. ఇవి శ‌రీరానికి అత్యంత శ‌క్తిని అంద‌జేస్తాయి. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. అధిక బ‌రువు తగ్గుతారు. 

శ‌రీరంలో శ‌క్తి.. 

గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి.10 బాదం ప‌ప్పుల‌ను రాత్రి నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం వాటి పొట్టు తీసి తింటే అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందవచ్చు. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన త‌రువాత జీల‌క‌ర్ర నీళ్లు లేదా వాము నీళ్ల‌ను కూడా తాగొచ్చు. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచి శ‌రీరానికి శ‌క్తినిస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజంతా మనం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సుల‌భంగా శోషించుకుంటుంది. అలాగే శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అధిక బ‌రువు సమస్య నుంచి కూడా బయట పడొచ్చు. 

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : healthy-food super-food eating-habits healthy-habits anti-aging-food food-habits good-habits anti-aging-issues healthy-eating-habits healthy-lifestyle-habits

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com