విటమిన్ B3 లోపం కారణంగా శరీరంలో ఈ వ్యాధులు తప్పవు..
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో పోషకాహార లోపాలు సర్వ సాధారణంగా మారాయి. అందులో విటమిన్ B3 (నియాసిన్) లోపం మన ఆరోగ్యానికి పెను సవాలుగా మారుతోంది. ఈ విటమిన్ లోపించడం వల్ల చర్మ సమస్యల నుంచి ప్రాణాంతక వ్యాధుల వరకు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమిటీ విటమిన్ B3? దాని లోపం వల్ల ఏం జరుగుతుంది? ఏ ఆహారాలు తినాలి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..అమెరికాలో H5N1 వైరస్ వ్యాప్తితో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ కేసులు..
ఇది కూడా చదవండి..శారీరక ఆరోగ్యానికి అయోడిన్ ఎందుకు ముఖ్యం అంటే..?
ఇది కూడా చదవండి..Healthy tips : తమలపాకులో 5 ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు..
విటమిన్ B3 ఎందుకు అంటే..?
విటమిన్ B3, లేదా నియాసిన్, శరీరంలో శక్తి ఉత్పత్తికి, జీర్ణక్రియకు, చర్మ ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థ పనితీరుకు కీలకం. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. పురుషులకు రోజుకు 16 మి.గ్రా., మహిళలకు 14 మి.గ్రా. నియాసిన్ అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు ఈ మోతాదు కొంచెం ఎక్కువ కావచ్చు.
విటమిన్ B3 లోపం వల్ల వచ్చే సమస్యలు..
విటమిన్ B3 లోపిస్తే శరీరం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ లక్షణాలను గమనించండి:చర్మ సంబంధిత సమస్యలు: చర్మం ముడతలు పడడం, ఎరుపు దద్దుర్లు, దురద. జీర్ణ సమస్యలు: అతిసారం, వాంతులు, ఆకలి లేకపోవడం. మానసిక సమస్యలు: మతిమరుపు, గందరగోళం, నిరాశ, ఆందోళన.
పెల్లాగ్రా డిసీజ్ : విటమిన్ B3 లోపం వల్ల చర్మం గరుకుగా మారడం, అతిసారం, మానసిక అస్థిరత, డయేరియా, డిమెన్షియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిరోధించడానికి చికిత్స తప్పనిసరి, లేకపోతే ప్రాణాంతకం కావచ్చు.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో, పోషకాహార లోపం వల్ల పెల్లాగ్రా కేసులు గతంలో నమోదయ్యాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే యువతలో కూడా ఈ లోపం పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..గుండెపోటు సంకేతాలు పురుషులు, మహిళలలో భిన్నంగా ఉంటాయా..?
ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
