అమెరికాలో H5N1 వైరస్ వ్యాప్తితో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ కేసులు..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అమెరికాలో H5N1 అనే బర్డ్ ఫ్లూ వైరస్ వేగంగా వ్యాపిస్తూ ఉంది. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురువు తున్నారు. ఈ వైరస్, ఇప్పటికే పక్షులు, ఇతర జంతువుల నుంచి మనుషులకు సోకిన సందర్భాలు ఉన్నాయి. H5N1 వైరస్ అనేది సాధారణంగా పక్షులలో కనిపించే ఒక రకమైన ఇన్‌ఫ్లూయెంజా వైరస్. అయితే, ఇది మనుషులకు సోకినప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవల అమెరికాలో పాడిపరిశ్రమలోని ఆవులలో సైతం ఈ వైరస్ వ్యాప్తి చెందడం ద్వారా అక్కడి కార్మికులకు సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అక్కడి అధికారులు ఈ వైరస్ సోకకుండా అప్రమత్తం అయ్యారు. 

 

ఇది కూడా చదవండి.. అధిక ఒత్తిడితో గుండె జబ్బుల ముప్పు..

ఇది కూడా చదవండి.. ఒత్తిడి ఎన్నిరకాలు..? లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?

 

 H5N1 వైరస్ మానవులలో సులభంగా వ్యాప్తి చెందితే, అది తీవ్రమైన మహమ్మారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పరీక్షలు, టీకాల అభివృద్ధి, ఆరోగ్య సిబ్బంది శిక్షణలను వేగవంతం చేశాయి.

అమెరికాలోని ప్రజలు ఈ వైరస్ గురించి అప్రమత్తంగా ఉండాలని, పక్షులు లేదా జంతువులతో సంబంధం ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ఆరోగ్య రంగంలో అత్యవసర చర్యలు, పరిశోధనలు కొనసాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.