సాక్షి లైఫ్ : అయోడిన్ అనేది శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన ఖనిజం. ఇది థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి, జీవక్రియను నియంత్రించడానికి సహాయ పడుతుంది. అయోడిన్ లోపం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో అయోడిన్ సరిపడా లేకపోతే థైరాయిడ్ సంబంధిత సమస్యలు, మానసిక వికాసంలో లోపాలు, శారీరక అభివృద్ధిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.