పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అతిపెద్ద కారణం ఇదే..
సాక్షి లైఫ్ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాన్సర్ సెంటర్(ఎయిమ్స్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్ సిడిఐఆర్) నిర్వహించిన అధ్యయనంలో పురుషుల్లో క్యాన్సర్ పెరగడానికి ప్రధానకారణాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల లంగ్ ఇండియా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి.. గర్భధారణ సమయంలో అధిక బరువును నివారించడానికి ఉత్తమ ఆహార ప్రణాళిక..!
ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
పురుషుల్లో మూడింట మూడు వంతుల మంది 50-74 సంవత్సరాల వయస్సులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని 69.4 శాతం మంది మహిళా రోగులు 45-69 సంవత్సరాల వయస్సులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అధ్యయనం కనుగొంది. పురుషులతో పోలిస్తే చాలా తక్కువ మంది మహిళలు ధూమపానం చేస్తున్నారు.
నేషనల్ నాన్-కమ్యూనికబుల్ డిసీజ్ సర్వైలెన్స్ సర్వే ప్రకారం, దేశంలో 23 శాతం మంది పురుషులు ధూమపానం చేస్తున్నారు. బీడీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 2.64 రెట్లు, సిగరెట్ తాగడం వల్ల 2.23 రెట్లు పెరుగుతుంది. పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ధూమపానం అతిపెద్ద కారణమని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఎందుకంటే సగటున పురుషులు 21 సంవత్సరాల వయస్సులో ధూమపానం చేయడం మొదలుబెడతారు. ఈ అలవాటు కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కువమందిలో క్యాన్సర్‌కు కారణమవుతుంది. దేశంలో 1.3 శాతం మంది మహిళలు మాత్రమే ధూమపానం చేస్తారు కానీ 37.5 శాతం మంది మహిళలు భర్త లేదా కుటుంబంలోని పురుష సభ్యులు ధూమపానం చేయడం వల్ల పాసివ్ స్మోకింగ్‌కు గురవుతున్నారు. పాసివ్ స్మోకింగ్ అంటే పొగ తాగేవారి దగ్గర నిలబడి ఉన్న వ్యక్తుల శ్వాస ద్వారా ఊపిరితిత్తులకు చేరే పొగ.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
