మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలోని అవయవాలన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఒకవేళ శరీరంలో ఏదైనా ఒక అవయవం బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉంటే అది మన శరీరాన్ని మొత్తంపై ప్రభావితం చూపిస్తుంది. మనకు కిడ్నీలు చాలా ముఖ్యం.. కిడ్నీలు శరీరం నుంచి నీటిని ఫిల్టర్ చేయడానికి సహాయ పడుతుంది. కిడ్నీ సమస్య ఉంటే ఫెయిల్యూర్ అయ్యి, డయాలసిస్ చేయించాల్సిన పరిస్థితి రావొచ్చు.. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లడ్ షుగర్..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలి. రక్తంలో చక్కర స్థాయి పెరగడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. డయాబెటిక్ పేషంట్లలో కిడ్నీఫెయిల్యూర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలి అంటేఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.. నీరు ఎక్కువ తాగితే తద్వారా డీహైడ్రేషన్ సమస్య ఉండదు.
గుండె సంబంధిత సమస్యలు..
బీపీ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. గుండె సంబంధిత సమస్యలు తలెత్తినా కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అందుకోసం ప్రతిరోజూ అర్థగంటకు పైగా సమయం కేటాయించాలి. తగినంత నిద్ర అవసరం.. సరైన సమయంలో నిద్ర పోతే అన్ని అవయవాలు బాగుంటాయి.. శరీరం లోని అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర చాలా అవసరం.
పుచ్చకాయ..
తప్పనిసరిగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఉదయాన్నే నిమ్మరసం తాగాలి. నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది. తద్వారా కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. పుచ్చకాయలో 91శాతంవరకూ నీరే ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. దోసకాయలో 96శాతం వరకు నీరు ఉంటుంది. దోసకాయ, పుచ్చకాయ నిత్యం తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి.
కిడ్నీల పనితీరు..
పాలకూర, క్యారట్, గ్రీన్ ఆపిల్, దోసకాయ కలిపి తయారుచేసే జ్యూస్ ఉదయం లేవగానే సేవించడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. టీ, కాఫీ లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలపై ప్రభావం పడి వాటి పనితీరును దెబ్బతీస్తాయి. నిత్యం బార్లీ నీరు తాగితే కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ రాళ్లు వచ్చినా పోతాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే..
ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు కిడ్నీల పనితీరుని పెంపొందిస్తాయి. నిత్యం మద్యం తీసుకునేవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మద్యం తాగడం మానేయాల్సిందే.
మన శరీరంలో కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మలినాలను తొలగిస్తాయి. శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతాయి. మూత్రం రూపంలో వ్యర్థాలను తొలగిస్తాయి. అవి సరిగ్గా పనిచేస్తేనే మిగిలిన భాగాలూ ఆరోగ్యంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి.. డీహైడ్రేషన్ కు గురైతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
