Bad Breath : నోటి దుర్వాసన వేధిస్తోందా..? ఈ చిట్కాలతో శాశ్వతంగా చెక్‌ పెట్టండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా నోటి దుర్వాసన అనగానే దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్లే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ, దానికి తోడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణాలే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇతర అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉంది. వైద్య పరిభాషలో నోటి నుంచి వచ్చే దుర్వాసనను 'హాలిటోసిస్' అంటారు. దీనికి ప్రధానంగా పలు అంశాలు కారణమవుతాయి.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

 

నోటి దుర్వాసనకు అసలు కారణాలివే..

వైద్య పరిభాషలో నోటి నుంచి వచ్చే దుర్వాసనను 'హాలిటోసిస్' అంటారు. దీనికి ప్రధానంగా పలు అంశాలు కారణమవుతాయి. శుభ్రత లోపించడం.. దంతాలు, నాలుకను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా చేరడం. దంత సమస్యలు..చిగుళ్ల వ్యాధులు, పుచ్చు పళ్లు (cavities), ఇన్ఫెక్షన్లు.నోరు పొడిబారడం..లాలాజల ఉత్పత్తి తగ్గినప్పుడు బ్యాక్టీరియా సులభంగా వృద్ధి చెందుతుంది. ఆహారపు అలవాట్లు..పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఘాటైన మసాలాలు ఎక్కువగా తీసుకోవడం. చెడు అలవాట్లు.. పొగాకు నమలడం, ధూమపానం. ఇతర సమస్యలు.. తగినంత నీరు తాగకపోవడం, ఎక్కువ సేపు కడుపు మాడ్చడం, జీర్ణకోశ సమస్యలు.

ఈ జీవనశైలి మార్పులతో తాజా శ్వాస మీ సొంతం..

నోటి శుభ్రత విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. రెండుసార్లు బ్రషింగ్.. ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌తో తప్పనిసరిగా పళ్లు తోముకోవాలి.నాలుకను మర్చిపోవద్దు: టూత్ బ్రష్‌తో పాటే రోజూ టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. సగానికి పైగా బ్యాక్టీరియా ఇక్కడే దాగి ఉంటుంది.

ఫ్లాసింగ్ అవసరం..

పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను బ్రష్ పూర్తిగా తొలగించలేదు. అందుకే డెంటల్ ఫ్లాస్ వాడటం అలవాటు చేసుకోండి. అలాగే మంచి మౌత్‌వాష్‌ను ఉపయోగించండి. నీళ్లు ఎక్కువగా తాగాలి.. నోరు ఎండిపోకుండా చూసుకోవడం ముఖ్యం. తగినంత నీరు తాగడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. తాజా పండ్లు, కూరగాయలు.. క్యారెట్, కీరదోస, ఆపిల్ వంటివి నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరి నోరు శుభ్రపడుతుంది. పొగాకుకు దూరం..ధూమపానం, పాన్, గుట్కా వంటి అలవాట్లను పూర్తిగా మానుకోవాలి.

తక్షణ ఉపశమనానికి ఇంటి చిట్కాలు..

దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంట్లో ఉండే ఈ వస్తువులతో తక్షణ ఉపశమనం పొందవచ్చు. సోంపు, యాలకులు.. భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు లేదా ఒకటి రెండు యాలకులు నమలడం వల్ల శ్వాస తాజాగా మారుతుంది. లవంగాలు.. ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే నోటి దుర్వాసన ఇట్టే మాయం అవుతుంది. ఇది చిగుళ్ల నొప్పులకు కూడా మంచి మందు.

ఉప్పు నీటి పుక్కిలింపు..రోజూ ఉదయం లేదా రాత్రి గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి పుక్కిలించడం (Gargling) వల్ల నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. పుదీనా ఆకులు..నాలుగైదు పుదీనా ఆకులను నమలడం లేదా గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుముఖం పడుతుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు..

ప్రతి మూడు నెలలకోసారి మీ టూత్‌బ్రష్‌ను తప్పనిసరిగా మార్చండి. నోట్లో బ్యాక్టీరియా పెరగడానికి కారణమయ్యే స్వీట్లు, చక్కెర పదార్థాలను తగ్గించండి. చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం ద్వారా నోటిని పొడిబారకుండా చూసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించినప్పటికీ కొందరిలో నోటి దుర్వాసన తగ్గదు. అలాంటప్పుడు అది కడుపులో అల్సర్లు లేదా ఇతర అనారోగ్యాలకు సంకేతం కావచ్చు. కాబట్టి, వెంటనే దంత వైద్యుడిని (Dentist) సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.