Vitamin D Deficiency : దేశంలో నిశ్శబ్ద మహమ్మారి.. మీరు కూడా దీని బాధితులేనా..?
సాక్షి లైఫ్ : ఎండలు మెండుగా ఉండే మన భారతదేశంలో ఒక విచిత్రమైన ఆరోగ్య సంక్షోభం వేగంగా విస్తరిస్తోంది. ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ సమస్య ఇప్పుడు ఒక 'సైలెంట్ ఎపిడెమిక్' అంటే నిశ్శబ్ద మహమ్మారిలా మారుతోందని ఆరోగ్య నిపుణుల అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అదే.. విటమిన్ డి లోపం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేశ జనాభాలో దాదాపు 70 నుంచి 80 శాతం మంది ప్రస్తుతం ఈ సమస్యతో సతమత మవుతున్నారు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
చాలామంది విటమిన్ డి అంటే కేవలం ఎముకలకు సంబంధించి నదని మాత్రమే భావిస్తారు. కానీ, ఇది శరీరంలోని అనేక కీలక ప్రక్రియలను శాసిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నిరంతర అలసట, కండరాల నొప్పులు, తరచూ అనారోగ్యం బారిన పడటం, మానసిక నిరుత్సాహం వంటి లక్షణాలను చాలామంది వయసు పైబడటం వల్లో లేదా పని ఒత్తిడి వల్లో అనుకుని పొరబడుతుంటారు. కానీ, దీని వెనుక అసలు విలన్ విటమిన్ డి లోపమే కావచ్చు.
ఎండ ఎక్కువ ఉన్నా లోపం ఎందుకు..?
మన దేశంలో సూర్యరశ్మికి కొరత లేకపోయినా, ఈ విటమిన్ లోపించడానికి ప్రధాన కారణం మారిన మన జీవనశైలి.
ప్రజలు పూర్వం కంటే ఇప్పుడు ఎండలో గడిపే సమయం చాలా తగ్గిపోయింది.
పగటిపూట ఎక్కువ సమయం ఇళ్లు లేదా ఆఫీసులకే పరిమితమవ్వడం.
బయటకు వెళ్లినప్పుడు నిరంతరం సన్‌స్క్రీన్ లోషన్లు వాడటం వల్ల చర్మానికి ఎండ తగలకపోవడం.
శరీరానికి విటమిన్ డి ఎందుకు ముఖ్యం..?
మన శరీరం ఆహారం నుంచి కాల్షియం, ఫాస్ఫరస్ వంటి కీలక ఖనిజాలను గ్రహించాలంటే విటమిన్-డి అత్యంత అవసరం. ఇది లోపిస్తే శరీరానికి తగినంత కాల్షియం అందక ఎముకలు, దంతాలు బలహీనపడతాయి. కేవలం ఎముకలకే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడానికి, కండరాల సక్రమ పనితీరుకు కూడా ఇది తోడ్పడుతుంది.
తీవ్రమైన పరిణామాలు ఇవే..
ఆస్టియోపొరోసిస్ : దీర్ఘకాలంగా విటమిన్ డి లోపిస్తే ఎముకలు లోపల గట్టిదనాన్ని కోల్పోయి, చిన్న దెబ్బలకే విరిగిపోయే ప్రమాదం పెరుగుతుంది.
పిల్లల్లో రికెట్స్.. చిన్నపిల్లల్లో ఈ విటమిన్ లోపం వల్ల ఎముకల ఎదుగుదల దెబ్బతిని 'రికెట్స్' అంటే దొడ్డి కాళ్లు వంటి సమస్యలు వస్తాయి.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. కొన్ని పరిశోధనల ప్రకారం విటమిన్-డి స్థాయిలు తగ్గితే డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నివారణ మార్గాలు..
విటమిన్ డి లోపం ప్రమాదకరంగా మారకముందే గుర్తిస్తే దీన్ని సులువుగా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం చేయాల్సినవి..
ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కొంత సమయం ఎండలో గడపడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ డి పుష్కలంగా ఉండే గుడ్లు, పుట్టగొడుగులు, పాలు, చేపలు వంటి ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా, నిపుణులైన వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు విటమిన్-డి టాబ్లెట్లు లేదా సిరప్‌లు వాడాలి. మీ శరీరంలో పదే పదే అలసట, కీళ్ల నొప్పులు వంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రక్త పరీక్ష (Vitamin D3 Test) చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
