Vitamin D: చిన్నారుల ఆరోగ్యం విషయంలో "డి" విటమిన్ పాత్ర..? 

షేర్ చేయండి:
Vitamin D: చిన్నారుల ఆరోగ్యం విషయంలో "డి" విటమిన్ పాత్ర..? 

సాక్షి లైఫ్: సమతుల ఆహారం పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి ,రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని నిర్ధరిస్తుంది. విటమిన్ "డి" వంటివి ఆహారం ద్వారా అందక పోవచ్చు. ఇతర విటమిన్ల మాదిరిగా, విటమిన్ "డి" సాధారణంగా రోజువారీగా మనం తీసుకునే ఆహారాలలో అందుబాటులో ఉండదు.

ఇది కూడా చదవండి.. B12 : విటమిన్-B12 లోపాన్ని ఎలా అధిగమించాలి అంటే..?

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

అటువంటి పరిస్థితిలో, దీనిని పొందడానికి, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ "డి" పాత్ర చాలా ముఖ్యమైనది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు, వివిధ శారీరక ప్రక్రియలతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో "డి" విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు విటమిన్ "డి" వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.  


 విటమిన్ "డి" ఎందుకంటే.. 

విటమిన్ "డి"ని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. పిల్లల బలం ,అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం. ఇది కొవ్వులో కరిగే విటమిన్ . ఎముకల బలానికి మాత్రమే కాదు. ఇది హార్మోన్ రూపంలో వివిధ శారీరక విధులను కూడా ప్రభావితం చేస్తుంది.

ఎముకలు-కండరాలను బలోపేతం చేయడంలో.. 
 
విటమిన్ "డి"ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి శరీరంలో కాల్షియం, ఫాస్ఫేట్ వంటి అవసరమైన మినరల్స్ ను పెంచడానికి 'డి " విటమిన్స్ తోడ్పడుతుంది. అంతేకాదు ఎముకలు, కండరాలను దృఢంగా ,ఆరోగ్యంగా మార్చడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది.  

చక్కెరను కిలోగ్రాములలో, పాలను లీటర్లలో కొలిచినట్లే, విటమిన్లను  ఇంటర్నేషనల్ యూనిట్లు(IU)లో కొలుస్తారు.

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) ప్రకారం.. ప్రతిరోజూ నవజాత శిశువులకు 400 IUలు, పిల్లలు, పెద్దలకు 600 IUల విటమిన్ "డి" అవసరం. రోజూ సరైన మోతాదులో విటమిన్ "డి" తీసుకోవడం వల్ల వారి ఎముకలు బలపడతాయి. 

అనేక రకాల అనారోగ్యసమస్యలు.. 

విటమిన్ "డి " లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.   కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైన లక్షణాలు విటమిన్ "డి" లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి విటమిన్ "డి" తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి.. Immunotherapy: ఇమ్యునోథెరపీ ఎన్ని రకాలు..? 

ఇది కూడా చదవండి.. Immunotherapy : ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది..?

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.