Immunotherapy : ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది..?
సాక్షి లైఫ్ : ఇమ్యునోథెరపీ అనేది ఒక రకమైన క్యాన్సర్ చికిత్స. ఈ చికిత్సలో క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటితో పోరాడి వాటిని నాశనం చేసేలా శరీర రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తారు. సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్‌లు వంటి వాటితో పోరాడుతుంది. అయితే క్యాన్సర్ కణాలు చాలా తెలివిగా రోగనిరోధక వ్యవస్థ కళ్లకు చిక్కకుండా దాక్కుంటాయి. ఇమ్యునోథెరపీ అనేది రోగనిరోధక వ్యవస్థను మేల్కొల్పి క్యాన్సర్ కణాలను వెతికి మరీ నాశనం చేస్తుంది.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
ఇమ్యునోథెరపీ..
కీమోథెరపీ లాగా క్యాన్సర్ కణాలను నేరుగా చంపకుండా, ఇమ్యునోథెరపీ ఈ కింది పద్ధతుల్లో పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచడం: రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా ప్రేరేపిస్తుంది. క్యాన్సర్ కణాలను గుర్తించేలా చేయడం: కొన్ని రకాల మందులు క్యాన్సర్ కణాలను రోగనిరోధక కణాలకు సులభంగా కనిపించేలా చేస్తాయి, తద్వారా వాటిని నాశనం చేయడం సులభమవుతుంది.
రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకునే వాటిని తొలగించడం: క్యాన్సర్ కణాలు తమను రక్షించుకోవడానికి కొన్ని ప్రోటీన్‌లను విడుదల చేస్తాయి. ఇమ్యునోథెరపీ మందులు ఈ ప్రోటీన్‌లను అడ్డుకుంటాయి, దాంతో రోగనిరోధక వ్యవస్థ నిర్భయంగా క్యాన్సర్ కణాలపై దాడి చేస్తుంది. తద్వారా క్యాన్సర్ కొంతమేర తగ్గడానికి ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
