డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే ఏమిటి..?

షేర్ చేయండి:
డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే, మన జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉండాలి. శరీరంలో ఉండే అనేక డైజెస్టివ్ ఎంజైములు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అయితే, కొన్నిసార్లు వాటి లోపం వల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది. మెరుగైన జీర్ణవ్యవస్థకు డైజెస్టివ్ ఎంజైమ్‌లు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే..? ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ అవసరం.. అది ఎలా వస్తుంది..? 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

కడుపు ఆరోగ్యం.. 

శరీరంలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మీరు కొన్ని ఆహార పదార్థాలతో శరీరంలోని వాటి లోపాన్ని భర్తీ చేయవచ్చు. శారీరక ఆరోగ్యమైనా, మానసిక ఆరోగ్యమైనా ప్రతిదీ మన జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కడుపు ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే సరైన జీర్ణక్రియకు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కడుపు ఉబ్బరం, పుల్లని త్రేనుపులు, అసిడిటీ లేదా రోజంతా కడుపు నొప్పిగా అనిపిస్తుంది. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

డైజెస్టివ్ ఎంజైమ్స్..?

మన శరీరంలో అమైలేస్, మాల్టేస్, లాక్టేస్, లిపేస్, సుక్రేస్, ప్రోటీజ్‌లతో సహా అనేక డైజెస్టివ్ ఎంజైములు ఉన్నాయి. ఇవన్నీ మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడే ప్రధాన ఎంజైములు. ఇవి నోటి, కడుపు, చిన్న ప్రేగులతో సహా మన జీర్ణవ్యవస్థలో తయారవుతాయి. అయితే ఈ అన్ని అవయవాలు కాకుండా, ప్యాంక్రియాస్ వాటిని తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఎంజైమ్‌లు మన శరీరంలోని పోషకాలను విచ్ఛిన్నం చేయడంలో ,గ్రహించడంలో సహాయపడతాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఇది కూడా చదవండి.. డైజెస్టివ్ ఎంజైమ్‌లు అధికంగా ఉండే ఆహారాలు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.