పారాబెన్స్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : సౌందర్య ఉత్పత్తులు తొందరగా పాడవ్వకుండా బాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలను నిరోధించడంతోపాటు అవి ఎక్కువ కాలం ఉండేలా ఆయా ఉత్పత్తులలో పారాబెన్స్ అంటే సింథటిక్ ప్రిజర్వేటివ్స్. పారాబెన్స్ అనేవి సాధారణంగా సౌందర్య సాధనాలు, ఔషధాలు,వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగించే సింథటిక్ రసాయనాల సమూహం. పారాబెన్‌లలో మిథైల్‌పారాబెన్, ఇథైల్‌పారాబెన్, ప్రొపైల్‌పారాబెన్, బ్యూటిల్‌పారాబెన్, ఐసోబ్యూటిల్‌పారాబెన్ వంటి రకాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..?
మాయిశ్చరైజర్‌లు, షాంపూలు, కండిషనర్లు, మేకప్, లోషన్‌లు , డియోడరెంట్‌లతో సహా పలు రకాల ఉత్పత్తులలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
* ఇవి షాంపూలు, వాణిజ్య మాయిశ్చరైజర్లు, షేవింగ్ జెల్లు, వ్యక్తిగత లూబ్రికెంట్లు, పేరెంటరల్ ఫార్మాస్యూటికల్స్, సన్-టాన్ ఉత్పత్తులు, మేకప్ క్రీమ్స్, టూత్‌పేస్ట్‌లలో కనిపిస్తాయి.
* వీటిని ఫుడ్ ప్రిజర్వేటివ్‌లుగా కూడా ఉపయోగిస్తారు. పారాబెన్లు గాయాలకు చికిత్సలు అందించే ఔషధ ఉత్పత్తులలో కూడా ఉంటాయి.
* ఇవి చర్మాన్ని తేమగా ఉంచడం ద్వారా, ఇన్ఫెక్షన్‌ను నివారించడం ద్వారా గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి.
* పారాబెన్స్‌లోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు గాయాన్ని నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు దీర్ఘకాలిక గాయాలను, ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి సహాయపడుతాయి.
కొన్ని పారాబెన్లు ప్రకృతిలో సహజంగా ఏర్పడతాయి. మిథైల్‌పారాబెన్ అనేది కొన్ని కీటకాల ద్వారా స్రవించే ఫెరోమోన్ (హార్మోన్). ప్రొపైల్‌పరాబెన్, బ్యూటిల్‌పారాబెన్ వంటి పారాబెన్‌లు సహజంగా కొన్ని మొక్కలు, కీటకాలలో కనిపిస్తాయి. వాణిజ్యపరంగా ఉపయోగించే అన్ని పారాబెన్‌లు కృత్రిమంగా ఉత్పత్తి చేస్తారు.
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
