నానబెట్టిన చియా గింజల నీటిని తాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు..?
సాక్షి లైఫ్ : చియా గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్ తోపాటు పలురకాల విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఆహారంలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
చియా సీడ్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ , ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి చాలా మేలు చేస్తాయి.
చియా గింజలు నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఉదయాన్నే చియా గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
పీచు పుష్కలంగా ఉండే చియా గింజల్లో నానబెట్టిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఉదయం పూట చియా సీడ్స్ తినడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది.
చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు ఇవి మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఉదయం పూట చియా గింజలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. చియా గింజల్లో కాల్షియం ,ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
ఉదయం పూట ఫైబర్ అధికంగా ఉండే చియా సీడ్స్ వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు కూడా తగ్గవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
