ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం అంటే..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన గుండె కోసం కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులు అవసరం. జీవనశైలి, ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి మాత్రమేకాకుండా గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో మరికొన్ని అంశాలు సహాయపడతాయి. అవేంటంటే..?
వాకింగ్..
నడకను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 2 నుంచి 3 కిలోమీటర్లు నడవడం గుండె ఆరోగ్యానికి మంచిది. రెగ్యులర్ వాకింగ్ శరీర బరువును తగ్గిస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులను రాకుండా చేస్తుంది.
ఇది కూడా చదవండి.. పగటి నిద్ర ఆరోగ్యానికి మంచిదా..? కాదా..?
ఇది కూడా చదవండి.. మధుమేహం అదుపులో ఉండడంలేదా..? ఈటిప్స్ ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు..?
బరువు..
స్థూలకాయమనేది వందలాది రుగ్మతలకు మూలకారణం. మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన తీవ్రమైన పరిస్థితులు కూడా ఊబకాయం ద్వారా తీసుకురావచ్చు. కాబట్టి మీ బరువును తగ్గించడం చాలా ముఖ్యం.
ప్రాసెస్ చేసిన ఆహారాలు..
బయటి ఆహారం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంతగా మీ గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. వేయించిన వంటకాలు, సాసేజ్‌లు, వెన్న, కేకులు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి హానికరం.
విశ్రాంతి..
ఎప్పుడూ పని మీద ద్యాస పెట్టకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్లి ఆహ్లాదకరంగా గడపండి.. ఆనందించండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి.. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎర్గోనామిక్ ఫర్నిచర్ పాత్ర.. ?
ఇది కూడా చదవండి.. ఓరల్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి.. పిల్లలకు ఇచ్చే టీకాల ప్రాముఖ్యత తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
