స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయి..?

షేర్ చేయండి:
స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయి..?

సాక్షి లైఫ్ : స్ట్రాబెర్రీ అనేది ఎరుపు రంగులో ఉండే జ్యుసిగా ఉండే  పండు. కొద్దిగా పులుపు, తీపి కలిసి ఉండే ఈ పండును చాలామంది ఇష్టపడతారు. దాని రుచి మాత్రమే కాదు, దానిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? స్ట్రాబెర్రీస్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, వాటి గురించి తెలిస్తే తప్పనిసరిగా ఆశ్చర్య పోతారు. స్ట్రాబెర్రీస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు న్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 
స్ట్రాబెర్రీలను ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో పండిస్తారు. ఇవి అమెరికా, యూరప్‌లలో ఎక్కువగా పండుతాయి. భారతదేశంలో కూడా స్ట్రాబెర్రీలను ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో సాగు చేస్తారు. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  


స్ట్రాబెర్రీలు తినడం వల్ల.. 

రోగనిరోధక శక్తిని పెంచుతాయి : స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు ఇతర సీజనల్ డిసీజెస్ నుంచి  రక్షించడంలో సహాయపడుతుంది.

 

 చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతుంది: ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఎలాజిక్ ఆమ్లం చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది ముడతలను తగ్గించడంలో, మచ్చలనుతొలగించి చర్మాన్ని కాంతివంతం చేయడంలోనూ చర్మ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.