శ్వాసకోశ వ్యాధి లక్షణాలేంటి..?
సాక్షి లైఫ్: శ్వాసకోశ సమస్యల గురించి కళ్ళలో ఏవైనా మార్పులు, ముక్కు కారటం, దగ్గు లేదా గొంతులో చికాకు వంటి లక్షణాలు కనిపిస్తే, అది వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధికి కారణం కావచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. అటువంటి పరిస్థితిల్లో వెంటనే పల్మోనాలజిస్ట్‌ను సంప్రదించాలి. దీనికి ముందు శ్వాసకోశ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తప్పనిసరిగా తెలుసుకోవాలి..?
ఈ లక్షణాలతో శ్వాసకోశ సమస్యలను గుర్తించవచ్చు..
తీవ్రమైన పొడి దగ్గు. వాయు కాలుష్యం పెరిగేకొద్దీ మీకు పొడి దగ్గు వస్తుంది, అప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
చాలా మందికి గాలిలో ఉండే ధూళి కణాలతో అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది, ఇది శ్వాసకోశ వ్యాధులను కూడా ప్రేరేపిస్తుంది.
ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులలో అలెర్జీ ,వాపు వస్తుంటుంది.
మెట్లు ఎక్కేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. వాయు కాలుష్యం కారణంగా గురక కూడా పెరుగుతుంది.
ముక్కు కారడం, కళ్లు పొడిబారడం,దగ్గు అనేవి వాయు కాలుష్యం వల్ల కలిగే అలెర్జీల సాధారణ లక్షణాలు, ఇవి శ్వాసకోశ వ్యాధులను ప్రేరేపిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇదికూడా చదవండి.. పురుషుల లైంగిక ఆరోగ్యానికి మేలు చేసే గింజలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
