సాక్షి లైఫ్: ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే కోడిగుడ్డును మన ఆహారంలో భాగంగా చేసుకుంటాం. అయితే, గుడ్లను కొనుగోలు చేసేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వాటి పోషక విలువలను తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గుడ్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. గుడ్డు తాజాగా ఉందో లేదో తెలిపే సరైన నిల్వ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Quality sleep : నాణ్యమైన నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Ayushman Card : ఆయుష్మాన్ కార్డు పొందడానికి ఏమేం పత్రాలు అవసరం.. ఎలా అప్లై చేసుకోవాలి..?
ఇది కూడా చదవండి..Front-Loading Calories : ఫ్రంట్ లోడింగ్ క్యాలరీస్ అంటే ఏమిటి..? బరువు తగ్గడంలో దీని పాత్ర..?
సూపర్ మార్కెట్ వెళ్లినప్పుడు లేదా గుడ్ల దుకాణానికి వెళ్లినప్పుడు చాలామంది ఒకేసారి 30 గుడ్ల ట్రేని ఇంటికి తెస్తుంటారు. ధర తక్కువగా ఉంటుందని లేదా పదే పదే వెళ్లే పని తప్పుతుందని ఇలా చేస్తుంటారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఒకేసారి ఎన్ని గుడ్లు కొంటున్నారు అనే దానికంటే, వాటిని ఎన్ని రోజుల్లో వినియోగిస్తున్నారు అనేదే ముఖ్యం. 'తాజా' గుడ్డులోనే పూర్తి పోషకాలు ఉంటాయని మర్చిపోవద్దు.
ఎన్ని గుడ్లు కొనాలిమరి..?
సాధారణంగా ఒక కుటుంబంలో సభ్యుల సంఖ్య, వారు వారానికి ఎన్ని గుడ్లు తింటారో లెక్క చూసుకుని, గరిష్టంగా ఒక వారం నుంచి పది రోజులకు సరిపడా కొనడం ఉత్తమం. ఎందుకంటే..? గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచితే 3 నుంచి 5 వారాల వరకు పాడవకుండా ఉంటాయి. కానీ, బయట ఉంచితే వాతావరణాన్ని బట్టి వారం రోజుల్లోనే వాటి నాణ్యత తగ్గడం మొదలవుతుంది. గుడ్డు పాతబడే కొద్దీ అందులోని తెల్లసొన పలచబడుతుంది, పచ్చసొన త్వరగా విరిగిపోతుంది. అందుకే వీలైనంత వరకు తాజాగా ఉన్న గుడ్లను కొనుగోలు చేయడం మంచిది.
రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు..?
ఎటువంటి గుండె జబ్బులు, మధుమేహం లేని వారు రోజుకు 1 నుండి 2 గుడ్లు నిరభ్యంతరంగా తీసుకోవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ, ఇతర ప్రముఖ ఆరోగ్య సంస్థల తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు అథ్లెట్లు, జిమ్‌కు వెళ్లేవారు..ప్రోటీన్ కోసం నిపుణుల సలహాతో రోజుకు 3 నుంచి 4 గుడ్లు తెల్లసొన ఎక్కువ భాగం తీసుకోవచ్చు.
గుండె రోగులు,మధుమేహ సమస్య ఉన్నవారు వారానికి 3 నుంచి 4 గుడ్లు.. అదికూడా కేవలం తెల్లసొనను మాత్రమే తినడం సురక్షితం. కొనేటప్పుడు.. నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తలు..పగుళ్లను గమనించండి..గుడ్డుపై చిన్న పగులు ఉన్నా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకే పగుళ్లు లేని గుడ్లనే ఎంచుకోవాలి.
గుడ్డు తాజాగా ఉందా..? లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక గ్లాసు నీటిలో గుడ్డును వేయాలి. అది అడుగు భాగానికి చేరితే తాజాగా ఉన్నట్లు, నీటిపై తేలితే అది పాడైనట్లుగా గుర్తించాలి. గుడ్లను వేయించడం (Fried) కంటే ఉడికించి (Boiled) లేదా ఆమ్లెట్ లాగా వేసుకుని తింటే పూర్తిస్థాయిలో పోషకాలు అందుతాయి.
గుడ్డుతినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది ఏమాత్రం నిజం కాదు. అందులోని 'లెసిథిన్' కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అయితే, గుడ్డును వెన్న లేదా చీజ్‌తో కలిపి అతిగా తినడం మాత్రం మంచిది కాదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com