యూరిక్ యాసిడ్ పెరిగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?
సాక్షి లైఫ్ : మనిషి శరీరం ఒక మిషన్ వలె పనిచేస్తుంది. అయితే అలాంటి శరీరంలో అనేక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కోసారి వాటి సమతుల్యత చెదిరినప్పుడు, మొత్తం శారీర వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. అటువంటప్పుడే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్, హిమోగ్లోబిన్ వంటి స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిలో యూరిక్ యాసిడ్ ఒకటి.
ఇది కూడా చదవండి.. రక్తదానం చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..?
యూరిక్ యాసిడ్ మన కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. మూత్రం ద్వారా బయటకు పోతుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు కొన్నిసమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగితే, అది శరీరంలోని చిన్న కీళ్లలో పేరుకుపోయి గౌట్ సమస్యను కలిగిస్తుంది. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లు , కిడ్నీల వైఫల్యానికి దారితీయవచ్చు. దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకోసం ఏమి చేయాలో ఈకింది వీడియో చూసి తెలుసుకుందాం..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
