పైనాపిల్ జ్యూస్ ఎక్కువగా తాగితే కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పైనాపిల్ జ్యూస్ మితంగానే సేవించడం శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు పైనాపిల్ జ్యూస్ తీసుకునేముందు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. అలర్జీలు, చర్మ ప్రతిచర్యలు: కొంతమందికి పైనాపిల్‌లోని బ్రోమెలైన్ వల్ల అలర్జీలు రావచ్చు. చర్మంపై దురద, ఎర్రటి దద్దుర్లు, వాపు వంటి సమస్యలు కనిపించవచ్చు.
ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
రక్తస్రావం ప్రమాదం: బ్రోమెలైన్ రక్తానికి పలుచబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల అధిక మొత్తంలో పైనాపిల్ జ్యూస్ తాగినప్పుడు గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా రక్తాన్ని పలుచబరిచే మందులు (బ్లడ్ థిన్నర్స్) వాడుతున్నవారు పైనాపిల్ రసం తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
రక్తపోటు సమస్య: పైనాపిల్ రసం అధికంగా తీసుకుంటే రక్తపోటు గణనీయంగా తగ్గిపోయి, బలహీనత, కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
మూత్రపిండాలపై భారం: పైనాపిల్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాలకు హానికలిగిస్తుంది. ఇప్పటికే మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువ పైనాపిల్ రసం తాగితే మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. తద్వారా అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
