జీర్ణక్రియ సరిగా లేకపోతే ఏమౌతుంది..?
సాక్షి లైఫ్ : ఈ రోజుల్లోపెద్దలు, చిన్నారులు, యువకులు అనే తేడాల్లేకుండా అందరూ అనేక జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మే 29న 'వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే'ని జరుపుతుంటారు.
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం 2024: జీర్ణవ్యవస్థ మంచిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ నేటి తరంలో రోజురోజుకు క్షీణిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా, అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలు తరచుగా ప్రేగు సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటి అనేక జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో జీర్ణక్రియ, కడుపుకు సంబంధించిన ఈ సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మే 29 న 'ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం' జరుపుకుంటారు.
ఆరోగ్యంగా ఉండాలంటే..? జీర్ణ ప్రక్రియ అనేది సరిగా ఉండటం చాలా ముఖ్యం. కానీ తరచుగా జీర్ణక్రియకు సంబంధించిన కొన్ని అపోహలు మన సమస్యలను పెంచుతాయి. కాబట్టి జీర్ణ క్రియ దెబ్బతినకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
