బ్రెయిన్ ఎన్యోరిజం అంటే ఏమిటి..? దీనిని 'సైలెంట్ కిల్లర్'గా ఎందుకు పిలుస్తారు?
సాక్షి లైఫ్ : మెదడులోని రక్తనాళాల్లో చిన్న బుడగలా ఉబ్బడాన్ని బ్రెయిన్ ఎన్యోరిజం అంటారు. దీనిని సెరిబ్రల్ ఎన్యోరిజం లేదా ఇంట్రాక్రానియల్ ఎన్యోరిజం అని కూడా పిలుస్తారు. రక్తనాళాలపై రక్త ప్రవాహం ఒత్తిడి పెరిగినప్పుడు ఇది ఏర్పడి, క్రమంగా పెద్దదవుతుంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ ఎన్యోరిజం పగిలిపోతే, మెదడులో రక్తస్రావం (హెమరేజిక్ స్ట్రోక్) జరిగి ప్రాణాపాయం సంభవించవచ్చు. దీనికి తక్షణ వైద్య చికిత్స తప్పనిసరి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
బ్రెయిన్ ఎన్యోరిజంను 'సైలెంట్ కిల్లర్' అని పిలవడానికి ప్రధాన కారణం, చాలా సందర్భాలలో దీని లక్షణాలు చాలా కాలం పాటు కనిపించకపోవడమే. అయితే, అది పగిలిపోయినప్పుడు లేదా నాడీ వ్యవస్థపై ఒత్తిడి కలిగించినప్పుడు తీవ్రమైన లక్షణాలు బయటపడతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
