Weight and Blood Sugar : బరువు, షుగర్ కంట్రోల్ చేసే 'బార్లీ' రొట్టెల గురించి తెలుసా..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగిన తర్వాత సిరిధాన్యాల (millets) వాడకం బాగా పెరిగింది. అయితే, బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ నియంత్రణకు ఇప్పుడు మిల్లెట్స్‌తో పాటు మరో తృణధాన్యం కూడా ఆకర్షిస్తోంది. అదే 'బార్లీ పిండి' (Barley Flour). గోధుమ రొట్టెలకు బదులుగా బార్లీ రొట్టెలు తినడం వల్ల కలిగే లాభాలు, అందులోని పోషకాలు, ఎవరు తినకూడదు లాంటి విషయాలు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
బార్లీ పిండి అంటే ఏమిటి..? అందులో ఏముంటాయి..?
మన భారతీయ వంటకాల్లో బార్లీ వాడకం పురాతన కాలం నుంచి ఉంది. బార్లీ గింజలను పొడి చేసి ఈ పిండిని తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ (fiber), ప్రొటీన్, బి-విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. బార్లీ పిండిలో అత్యంత ముఖ్యమైనది 'బీటా-గ్లూకాన్' (Beta-Glucan) అనే కరిగే ఫైబర్. జీవక్రియలను (metabolism) మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
బార్లీ రొట్టెలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
షుగర్ నియంత్రణ..ఇందులోని బీటా-గ్లూకాన్ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా భోజనం చేసిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా ఉంటాయి.
బరువు తగ్గడం.. బార్లీలోని ఫైబర్ కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయదు, అతిగా తినడాన్ని అరికట్టవచ్చు. ఊబకాయం తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
జీర్ణక్రియకు మేలు..పీచు పదార్థం పేగుల కదలికను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. తగినన్ని నీళ్లు తాగుతూ దీన్ని తీసుకుంటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్.. బీటా-గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. రోజువారీ డైట్లో బార్లీని చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. శరీరానికి మంచి శక్తి అందుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ తినొచ్చా..?
షుగర్ పేషెంట్లు తమ డైట్లో బార్లీ రొట్టెలను నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇందులోని ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో కూడా కొంత శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి, మోతాదు మించకుండా చూసుకోవాలి. వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు మాత్రమే ఈ మార్పులు చేసుకోవడం మంచిది.
ఎవరు తినకూడదు..?
సీలియాక్ వ్యాధి ఉన్నవారు.. బార్లీలో సహజంగానే 'గ్లూటెన్' ఉంటుంది. కాబట్టి గ్లూటెన్ పడని వారు (Gluten sensitivity), సీలియాక్ వ్యాధితో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు..ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల తొలిరోజుల్లో కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి అలవాటు పడేవరకు తక్కువ మోతాదులో ప్రారంభించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
