మనిషి శరీరంలో ఉండే నీటి శాతం..?

షేర్ చేయండి:
మనిషి శరీరంలో ఉండే నీటి శాతం..?

సాక్షి లైఫ్ : ప్రపంచంలోని 70 శాతం నీరు ఉన్నప్పటికీ, అందులో కేవలం మూడు శాతం నీరు మాత్రమే తాగడానికి ఉపయోగపడేది. ఆరోగ్యంగా ఉండాలంటే మనం తాగేనీరు కూడా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండాలి. మనుషులకు, జంతువులకు, చెట్లకు, మొక్కలకు నీరు చాలా ముఖ్యమైన వనరు. ప్రతి జీవి ఆహారం లేకుండా కొన్నిరోజులు జీవించగలదు, కానీ నీరు లేకుండా జీవితాన్ని ఊహించలేము.

ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?  

కంటి చూపుకి స్పష్టంగా కనిపించిన నీరు తాగవచ్చని ఖచ్చితంగా చెప్పలేం. అందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఇంట్లోనే కొన్నిరకాల  పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు తాగే నీరు మీ ఆరోగ్యానికి మంచిదా..?  కాదా..? అనేది తనిఖీ చేయవచ్చు.

 నీటి నాణ్యతను గుర్తించడమెలా..? 

నీటి నాణ్యతను నిర్ణయించడంలో ముఖ్యమైన అంశం టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (టీడీఎస్) స్థాయి. ఇది నీటిలో కరిగిన పదార్ధాల మొత్తం సాంద్రతను సూచిస్తుంది. ఇంట్లో టీడీఎస్ స్థాయిని తనిఖీ చేయడం ద్వారా, నీటి నాణ్యతను సులభంగా, సమర్ధవంతంగా అంచనా వేయవచ్చు. దాని వినియోగానికి సంబంధించి సమాచారం తెలుసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో నీటి టీడీఎస్ స్థాయిని ఎలా తనిఖీ చేయాలి..?  అంటే..?   

 

నీటి స్వచ్ఛతను తనిఖీ చేయడానికి టీడీఎస్ ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా నీరు తాగడానికి పనికివస్తుందా..?  లేదా అనేది నిర్ధారిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, నీటి టీడీఎస్ స్థాయి 100 నుంచి 250  పిపిఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉండాలి. ఇలాంటి నీరు తాగడానికి సురక్షితమైనవి. అయితే, టీడీఎస్ పరిమాణం దీని కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటే, తాగడానికి పనికిరాదని అర్థం.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ లక్షణాలు..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.